పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా విడుదల కోసం ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. క్రిష్ జాగర్లమూడి మొదలుపెట్టిన ఈ సినిమాను చివరికి జ్యోతి కృష్ణ పూర్తి చేసారు. ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ సినిమా పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది. చివరకు జులై 12 న ఈ సినిమా విడుదల చేస్తున్నట్టు సినిమా యూనిట్ ప్రకటన చేసింది. కాని మళ్ళీ తేదీని మారుస్తూ నిర్ణయం తీసుకుంది మూవీ యూనిట్ అనే ప్రచారం ఒకటి జరిగింది.
Also Read : కామెడీ స్పీచ్ ఇరగదీసిన జగన్
జులై 14 న సినిమాను విడుదల చేస్తారని వార్తలు వచ్చాయి. దీనితో పవన్ ఫ్యాన్స్ మళ్ళీ డీలా పడ్డారు. ఈ సినిమా షూటింగ్ కూడా చాలా రోజుల పాటు జరిగిన సంగతి తెలిసిందే. ఏళ్ళ తరబడి జరిగిన షూటింగ్ కు పవన్ హాజరు కాకపోవడంతో సినిమా నిర్మాణ వ్యయం కూడా భారీగా పెరిగింది. సినిమా షూటింగ్ కు పవన్.. ఎన్నికలు, ప్రభుత్వ పాలన కారణంగా దూరంగా ఉంటూ వచ్చారు. ఇటీవల పవన్ షూట్ కంప్లీట్ కావడంతో సినిమా డేట్ ను అనౌన్స్ చేసి.. ట్రైలర్ కూడా రిలీజ్ చేయడానికి సిద్దమయ్యారు.
Also Read : తెనాలి పర్యటన వెనుక ఇంత కుట్ర ఉందా..?
ఈ సమయంలో సినిమా విడుదల వాయిదా పడింది. అటు టికెట్ రేట్స్ కూడా సినిమాకు ఇబ్బందికరంగా మారాయి అనే చెప్పాలి. ఈ తరుణంలో పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రెమ్యునరేషన్ తిరిగి ఇచ్చేసారు పవన్ కళ్యాణ్. నిర్మాత ఏ.ఎం.రత్నంను ఆదుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇక ఏపీ ప్రభుత్వం టికెట్ ధరలు పెంచే అవకాశం కూడా లేదనే వార్తలు వస్తున్నాయి. సినిమా వాళ్ళ విషయంలో సీరియస్ గా ఉన్న పవన్ కళ్యాణ్.. తన సినిమా నుంచే టికెట్ ధరల పెంపు విషయంలో కఠినంగా ఉండే అవకాశం కనపడుతోంది.