ప్రస్తుతం ఏపీలో టీడీపీ, జనసేన మధ్య సోషల్ మీడియలో వార్ నడుస్తోంది. అయితే ఈ మాటల యుద్ధానికి ప్రత్యక్షంగా టీడీపీ నేతలు కారణమైతే.. తెర వెనుక ఉండి ఆడిస్తోంది మాత్రం వైసీపీ. సీఎం చంద్రబాబు కడప జిల్లా మైదుకూరు పర్యటనలో రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఈ దుమారానికి కారణమయ్యాయి. లోకేష్‌ను డిప్యూటీ సీఎం చేయాలంటూ శ్రీనివాసరెడ్డి ప్రపోజల్ పెట్టారు. వాస్తవానికి ఏ పార్టీ నేతను… ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు భూజానికెత్తుకోవడం సర్వసాధారణం. అయితే ఇక్కడే అసలు సమస్య మొదలైంది. లోకేష్‌ను డిప్యూటీ చేస్తే.. పవన్‌ను సీఎం చేయాలని కొందరు జనసేన నేతలు డిమాండ్ చేశారు. దీనికి వైసీపీ కూడా ఆజ్యం పోసింది.
Also Read: బాలయ్యకు పద్మ పురస్కారం అవసరమా..?
ఫేక్ అకౌంట్ల ద్వారా టీడీపీ, జనసేన నేతల అవతారం ఎత్తిన కొందరు.. అలా చేస్తే తప్పేంటి.. ఇలా చేస్తే తప్పేంటి అంటూ కామెంట్లు పెట్టారు. మరికొందరైతే.. అటు పవన్‌ను, ఇటు లోకేష్‌ను దుర్భాషలాడారు కూడా. దీంతో ఈ మాటల యుద్ధానికి తెర దించాలని టీడీపీ, జనసేన అధినేతలు డిసైడ్ అయ్యారు. ముందుగా తమ పార్టీ నేతలకు చంద్రబాబు, లోకేష్ వార్నింగ్ ఇచ్చారు. మరోసారి ఇలా వ్యాఖ్యలు చేస్తే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దీంతో టీడీపీ తరఫు నుంచి ఈ వ్యవహారానికి బ్రేక్ పడింది. ఇక జనసేన తరఫున మంత్రి నాదెండ్ల మనోహర్ ఇదే తరహా సూచన చేశారు. అయినా సరే ఒకరిద్దరు నేతలు వ్యాఖ్యలు చేయడంతో స్వయంగా పవన్ రంగంలోకి దిగారు. జనసైనికులు, వీరమహిళలు, జననేన నాయకులకు బహిరంగ లేఖ రాశారు.
Also Read: అవినాష్ రెడ్డి ని అడ్డంగా బుక్ చేసిన విసారెడ్డి
5 ఏళ్ల వైసీపీ నిరంకుళ పాలనపైన, పాలకుల అవినీతిపైన ఏపీ ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని… సుస్థిరమైన ప్రభుత్వం, స్థిరమైన నాయకుని కోసం ఎదురు చూశారని లేఖలో ప్రస్తావించారు. అందుకే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడి ఎన్నికల్లో పోటీ చేశాయన్నారు. ఈ ఎన్నికల్లో ప్రజలు కూటమికి 94 శాతం సీట్లు గెలిపించారంటే గత ప్రభుత్వ అరాచకాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవాలన్నారు. 100 శాతం స్ట్రైక్ రేట్‌తో పోటీ చేసిన 21 అసెంబ్లీ. 2 పార్లమెంట్ స్థానాల్లో జనసేన అభ్యర్థులు గెలిచారని పవన్ గుర్తు చేశారు. ఈ విజయాన్ని ప్రజలు ఇచ్చిన బాధ్యతగా మలుచుకుని అధికారం చేపట్టిన రోజు నుంచి ప్రధాని నరేంద్ర మోదీ మార్గదర్శకంలో, సీఎం చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో సమగ్రాభివృద్ధి సాధించే దిశగా చిత్తశుద్ధితో పని చేస్తుందన్నారు.
Also Read: వైసీపీ క్యాడర్ భయం వెనుక కారణం జగన్ రెడ్డేనా..?
కూటమి 3 పార్టీలు బాధ్యతాయుతంగా పనిచేస్తున్న సమయంలో అనవసరమైన వివాదాల జోలికి, విభేదాల జోలికి వెళ్లవద్దంటూ పవన్ విజ్ఞప్తి చేశారు. సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు వార్తలపైన, కూటమి అంతర్గత విషయాలపైన, పొరపాటున ఎవరైనా నాయకులు స్పందించినా సరే.. దయచేసి ఎవరూ కూడా ప్రతిస్పందనగా వ్యక్తిగత అభిప్రాయాలు వెలిబుచ్చడం, బహిరంగంగా చర్చించడం చేయవద్దు అంటూ లేఖ రాశారు పవన్. మార్చి 14న జరిగనున్న జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజున పార్టీ భవిష్యత్తు లక్ష్యాల గురించి సమగ్రంగా చర్చికుందామంటూ పవన్ లేఖలో స్పష్టం చేశారు. పవన్ రాసిన లేఖతో జనసేన నేతలు, కార్యకర్తలు అంతా సైలెంట్ అయ్యారు.