Tuesday, October 28, 2025 06:58 AM
Tuesday, October 28, 2025 06:58 AM
roots

దారుణం.. 150 మందిని హత్య చేసిన హైజాకర్స్..!

పాకిస్తాన్‌లో దారుణం చోటు చేసుకుంది. ఇప్పటి వరకు విమానాలను మాత్రమే హైజాక్ చేస్తున్న ఉగ్రవాదులు.. ఇప్పుడు ఏకంగా ఓ ఎక్స్‌ప్రెస్ రైలునే ఎత్తుకెళ్లారు. స్వతంత్ర బలోచిస్థాన్ కోసం పోరాటం చేస్తున్న బలోచ్ విముక్తి సైన్యం పాకిస్తాన్ సర్కార్‌కు షాక్ ఇచ్చింది. జాఫర్ ఎక్స్‌ప్రెస్‌ రైలును బలోచ్ విముక్తి సైన్యం హైజాక్ చేసింది. హైజాక్ సమయంలో సుమారు 450 మంది ప్రయాణికులు రైలులో ఉన్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. వీరిలో ఎదురుతిరిగిన ఆరుగురిని అక్కడికక్కడే కాల్చి చంపేశారు. బందీలుగా పాకిస్తాన్ మిలటరీ, పోలీస్, యాంటీ టెర్రరిజం ఫోర్స్, ఐఎస్ఐకు చెందిన అధికారులు, సిబ్బంది ఉన్నారు.

Also Read : వాళ్లకు లాస్ట్ వార్నింగ్.. చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు…!

స్వతంత్ర బలూచిస్థాన్ కోసం ఎంతో కాలంగా ఆందోళనలు జరుగుతున్నాయి. ఈ పోరాటానికి బలోచ్ లిబరేషన్ ఆర్మీ.. (బీఎల్ఏ) నాయకత్వం వహిస్తోంది. మష్కఫ్, దాదర్, బోలన్ ప్రాంతాల్లో మెరుపు దాడులు కూడా బీఎల్ఏ చేసింది. జాఫర్ ఎక్స్‌ప్రెస్‌లో పాకిస్తాన్ మిలటరీ, పోలీస్, ఐఎస్ఐ అధికారులు, సిబ్బంది ప్రయాణిస్తున్న విషయం తెలుసుకున్న బలోచ్ లిబరేషన్ ఆర్మీ.. రైలు పట్టాలు తప్పించి జాఫర్ ‌ఎక్స్‌ప్రెస్‌ను హైజాక్ చేసింది. రైలులో ఉన్న వారంతా సెలవులో పాకిస్తాన్‌లోని పంజాబ్ వెళ్తున్న సమయంలో మెరుపు దాడి చేసినట్లు తెలుస్తోంది. తమపై సైనిక చర్య చేపడితే బందీలను హతమారుస్తామని హెచ్చరించారు. దీంతో పాకిస్తాన్ సర్కార్ ఎలాంటి చర్యలు చేపట్టలేదు.

Also Read : పార్టీ క్యాడర్ ను ముంచుతున్న ఎమ్మెల్యే…?

అయితే స్వతంత్ర బలూచిస్థాన్‌ లక్ష్యంగా తమ పోరాటం సాగుతుందని ప్రకటించిన బలోచ్ లిబరేషన్ ఆర్మీ అధికారులు… బందీలుగా ఉన్న 150 మంది సైనికుల్ని చంపేసినట్లు ప్రకటించింది. స్వతంత్ర బలోచిస్థాన్ కోసం 2000 సంవత్సరంలో బలోచ్ విముక్తి ఆర్మీ ఏర్పాటైంది. 150 మంది సైనికుల్ని చంపేసిన బీఎల్ఏ.. ఈ రక్తపాతానికి పూర్తి బాధ్యత ఆక్రమిత దళాలదే అని ప్రకటించింది. బందీలను సురక్షితంగా విడిపించేందుకు పాకిస్తాన్ ప్రధాని సహా మంత్రులు, అధికారులు ఎన్ని ప్రయత్నాలు చేసిన ఫలితం దక్కలేదు. ఈ ఘటనలో పాకిస్తాన్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బలోచిస్థాన్ విముక్తి ఆందోళనలు పరాకాష్టకు చేరటంతో పాకిస్తాన్ సర్కార్ తీవ్ర చర్యలు చేపడుతోంది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.....

తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక...

ఐసీయూలో శ్రేయస్ అయ్యర్.....

సౌత్ ఆఫ్రికా తో కీలక వన్డే...

చావులోను ఆగని విష...

సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మానవత్వంతో...

గట్టిగానే సంక్రాంతి పోటీ.....

సంక్రాంతి పండుగ.. తెలుగు వారికి అతి...

బ్రేకింగ్: పరకామణి కేసులో...

గత కొన్నాళ్లుగా తిరుమలలో పరకామణి వ్యవహారం...

కొత్త జిల్లాలు.. మారనున్న...

ఏపీలో జిల్లాల పునర్‌ విభజన ప్రక్రియ...

పోల్స్