మే 8వ తేదీ రాత్రి 8.00 గంటల నుంచి 11.30 గంటల మధ్య పాకిస్తాన్.. దేశంలోని అనేక నగరాలపై ఏకకాలంలో డ్రోన్ దాడులను ప్రారంభించిందని ఆర్మీ వర్గాలు తెలిపాయి. జమ్మూ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్‌లోని 24 నగరాలను లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్ దాదాపు 500 చిన్న డ్రోన్‌లను మోహరించిందని ఆర్మీ వెల్లడించింది. L70, ZU-23, షిల్కా, ఆకాశ్ వంటి క్షిపణి నిరోధక వ్యవస్థలను ఉపయోగించి పాకిస్తాన్ డ్రోన్ దాడిని భారత సైన్యం, వైమానిక దళం విజయవంతంగా అడ్డుకున్నాయి.
Also Read : ఆగని పాక్ ప్రయత్నాలు.. మళ్ళీ ఏడుగురిని పంపింది..!
మే 7వ తేదీ తెల్లవారుజామున పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకుని భారత ఆర్మీ దాడి చేయడంతో పాకిస్తాన్ ప్రతీకార దాడులకు దిగింది. ఆపరేషన్ సిందూర్ తర్వాత మే 8న జమ్మూ మరియు పఠాన్‌కోట్‌లోని సైనిక స్థావరాలతో సహా పలు ప్రాంతాలను పాక్ టార్గెట్ చేసింది. పాకిస్తాన్ నుండి ఎనిమిది క్షిపణులు సత్వారీ, సాంబా, ఆర్ఎస్ పురా మరియు అర్నియాలను లక్ష్యంగా చేసుకున్నాయని ఆర్మీ ఓ ప్రకటనలో తెలిపింది. వీటిని సమర్ధవంతంగా అడ్డుకున్నామని వెల్లడించింది.
Also Read : యుద్ధం మొదలైందా..? పాక్ టార్గెట్ చేసిన సిటీలు ఇవే
జమ్మూపై పాకిస్తాన్ దాడుల తీరు.. ఇజ్రాయెల్‌పై హమాస్ తరహా దాడిని గుర్తుకు తెస్తున్నాయని ఆర్మీ వెల్లడించింది. దేశ రాజధాని ఢిల్లీలో పలు విమానాలను రద్దు చేసారు. మే 9 నాటికి 138 విమానాలు రద్దు చేసినట్టు ఢిల్లీ విమానాశ్రయ వర్గాలు తెలిపాయి. ఇందులో 4 అంతర్జాతీయ రాకపోకలు, 5 అంతర్జాతీయ విమానాలు, 63 దేశీయ విమానాలు ఉన్నాయని పేర్కొన్నాయి.