పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణంపై ఏలూరు రేంజ్ ఐజి అశోక్ కుమార్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. మార్చి 24 తారీఖున పాస్టర్ ప్రవీణ్ కుమార్ కు ప్రమాదం జరిగి.. మృతి చెందారని దీనిపై ఎన్నో అనుమానాలు నేపద్యంలో ప్రత్యేక దృష్టి సారించామన్నారు. అధునాతన టెక్నాలజీతో ఈ కేసును దర్యాప్తు చేశామని తెలిపారు. దారి పొడవునా సిసి కెమెరాల్లో పాస్టర్ ప్రవీణ్ కుమార్ ప్రయాణాన్ని పరిశీలించాం… పలు లిక్కర్ షాపులు వద్ద ఆగి మద్యం కొనుగోలు చేసినట్లు గుర్తించామన్నారు. ప్రవీణ్ కుమార్ ట్రావెల్ చేస్తుంటే ఫోన్లో చాలామంది మాట్లాడారన్నారు.
Also Read : ఇది చెన్నై జట్టేనా..? రైనా తర్వాత ఎవరు..?
ఆయన స్నేహితులు కుటుంబ సభ్యులతో కూడా మేము మాట్లాడి వివరాలు తెలుసుకున్నాం…. అవన్నీ సాధారణ కాల్స్ అని తెలిపారు. బుల్లెట్ తో పాటు వెళ్లిన నాలుగు కార్లను పరిశీలించాం యూపీఐ పేమెంట్స్… ఫోన్ కాల్ లిస్ట్.. ఇతర వివరాలు అడిగి తెలుసుకున్నామన్నారు. ఇది మర్డర్ అని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారందరికీ నోటీసు ఇవ్వడం జరిగిందని వివరించారు. ఉదయం 11 గంటలకి హైదరాబాదు నుండి రాజమండ్రి బయలుదేరారు… సైట్ విషయంలో పనులు నిమిత్తం రాజమండ్రి వచ్చినట్లుగా తేలిందని వివరించారు.
Also read : బీజేపీతో డీల్ సెట్ చేసుకున్న సాయిరెడ్డి
రాజమండ్రిలో లోకల్ గా పనులు చూసుకోవడానికి బుల్లెట్ వేసుకుని రాజమండ్రి బయలుదేరారు… బుల్లెట్ని రాజమండ్రిలో పెట్టుకుందామని ఆలోచనతో వచ్చారన్నారు. ఎలాంటి ఎవిడెన్స్ తోని ఎవరు ముందుకు రాలేదు దాదాపు 10 రోజులు ఎదురు చూసామని వివరించారు. హైదరాబాద్ , కోదాడ… విజయవాడ తో పాటు పలుచోట్ల వైన్ షాపులకు వెళ్లి యూపీఐ పేమెంట్ చేశారు… రెండు చోట్ల ప్రమాదానికి గురి అయ్యారని, జగ్గయ్యపేట బైపస్ వద్ద మొదటి ప్రమాదం జరిగింది… అదృశ్యాలన్నీ సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి… కీసర టోల్ ప్లాజా వద్ద మరో ప్రమాదం జరిగి బుల్లెట్ హెడ్లైట్ పగిలిందన్నారు. విజయవాడ రామవరపాడు జంక్షన్ వద్ద మరో ప్రమాదం జరిగిన తర్వాత విజయవాడ ట్రాఫిక్ ఎస్ఐ మూడు గంటల పాటు అక్కడే కూర్చోబెట్టారన్నారు. పాస్టర్ ప్రవీణ్ కుమార్ మద్యం సేవించి ఉన్నారని స్థానిక పెట్రోల్ బంక్ సిబ్బంది ద్వారా వివరాలు సేకరించామని అశోక్ వివరించారు.