భూమిపై జీవం అంతం కానుందా..? శాస్త్రవేత్తలు త్వరలోనే ఆ తేదీలు ప్రకటించే అవకాశం ఉందా..? అంటే అవుననే సమాధానాలు వినపడుతున్నాయి. టోహో విశ్వవిద్యాలయంలోని పరిశోధకులు.. నాసాకు చెందిన ప్లానెటరీ మోడలింగ్ ఉపయోగించి చేసిన సూపర్ కంప్యూటర్ సిమ్యులేషన్ ఆసక్తికర విషయాలు బయటపెట్టింది. భూమిపై జీవం పూర్తిగా అంతరించే అవకాశం ఉందని లెక్కలతో సహా అంచనా వేసింది. భూమిపై జీవ మనుగడకు కీలకమైన ఆక్సీజన్ కనుమరుగు అయ్యే అవకాశం ఉందని తేల్చింది.
Also Read : ప్రపంచ కప్ కష్టమే.. గవాస్కర్ సంచలన కామెంట్స్
సుమారు ఒక బిలియన్ సంవత్సరాలలో భూమిపై యొక్క ఆక్సిజన్ అదృశ్యమవుతుందని, మనుగడ అసాధ్యం అవుతుందని అంచనా వేసింది. ఈ అధ్యయనం 4,00,000 అంశాలను పరిశీలిస్తూ.. భూ వాతావరణాన్ని అంచనా వేస్తూ తేల్చి చెప్పింది. సూర్యుడు వయసు పెరిగే కొద్దీ, అది వేడిగా, ప్రకాశవంతంగా మారుతుంది. ఇది భూమి యొక్క వాతావరణాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుందని తేల్చింది. ఈ పరిణామాలతో.. నీరు ఆవిరైపోతుంది, ఉపరితల ఉష్ణోగ్రతలు పెరుగుతాయని తెలిపింది.
Also Read : వంశీ చార్జ్ షీట్ లో సంచలన విషయాలు
అలాగే కార్బన్ చక్రం బలహీనపడుతుందని.. మొక్కలు చనిపోతాయని వివరించింది. దీనితో ఆక్సీజన్ ఉత్పత్తి నిలిచిపోతుందని పేర్కొంది. వాతావరణం అధిక మీథేన్ స్థితికి తిరిగి వెళ్ళే అవకాశం ఉందని, ఇది అత్యంత ప్రమాదకరమని తేల్చింది. నేచర్ జియోసైన్స్‌లో దీనికి సంబంధించిన కథనాన్ని ప్రచురించారు. భూమి జీవిత కాలం కేవలం బిలియన్ సంవత్సరాలు మాత్రమే అని స్పష్టం చేసారు. భవిష్యత్తులో ఆక్సీజన్ స్థాయిలు పడిపోయే అవకాశం ఉందని.. అలాంటి వాతావరణంలో జీవం ఉన్నప్పటికీ.. చాలా భిన్నంగా ఉంటుందని పేర్కొన్నారు.