Saturday, September 13, 2025 12:44 PM
Saturday, September 13, 2025 12:44 PM
roots

రెండు నాలుకల ఇంగ్లాండ్.. అడ్డంగా దొరికిందా..?

ఇంగ్లాండ్ వర్సెస్ భారత్ జట్ల మధ్య జరగనున్న 5వ టెస్ట్.. మొదలుకాకముందే ఆసక్తిని రేపుతోంది. మొదటి, మూడు టెస్టుల్లో గెలిచిన ఇంగ్లాండ్.. నాలుగో టెస్ట్ లో కూడా గెలిచి సీరీస్ ను కైవసం చేసుకోవాలని భావించింది. కాని అనూహ్యంగా ఇంగ్లాండ్ ఆటగాళ్లకు భారత్ షాక్ ఇచ్చింది. నాలుగవ రోజు గిల్, రాహుల్ పోరాటం, 5వ రోజు జడేజా, సుందర్ పోరాటంతో ఇంగ్లాండ్ డ్రా చేసుకునే పరిస్థితి వచ్చింది. గెలుస్తామనే ధీమాతో 5వ రోజు అడుగుపెట్టి చివరకు సెంచరీలు అడ్డుకోవడానికి డ్రా డ్రామా ఆడాడు ఆ జట్టు కెప్టెన్.

Also Read : మోడీ.. ఇది సిగ్గుచేటు.. సోనియా సంచలన కామెంట్స్ 

ఇక 5వ టెస్ట్ రెండు రోజుల ముందు ఓవల్ లో ప్రాక్టీస్ మొదలుపెట్టిన భారత జట్టు విషయంలో అక్కడి గ్రౌండ్ స్టాఫ్ కాస్త అత్యుత్సాహం ప్రదర్శించింది. దీనితో హెడ్ కోచ్ గంభీర్ సీరియస్ అయ్యాడు. ఆండర్సన్-టెండూల్కర్ ట్రోఫీ సిరీస్-నిర్ణయాత్మక మ్యాచ్‌ కావడంతో ప్రాక్టీస్ విషయంలో ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసింది ఇంగ్లాండ్. దీనితో ఓవల్ చీఫ్ క్యూరేటర్ లీ ఫోర్టిస్‌తో తీవ్ర వాగ్వాదానికి దిగాడు గంభీర్. గ్రౌండ్‌స్టాఫ్ వైపు వేలు చూపిస్తూ మేం ఏం చేయాలో మాకు చెప్పవద్దు అంటూ వార్నింగ్ ఇచ్చాడు.

Also Read : టీమిండియాకు గుడ్ న్యూస్.. పంజాబీ బౌలర్ వచ్చేస్తున్నాడు

దీనికి ప్రధాన కారణం మ్యాచ్ జరుగనున్న పిచ్ కు దూరంగా ఉండాలని క్యూరేటర్ చెప్పడం. వాస్తవానికి పిచ్ పై నడవకూడదు. రోలర్ తో మాత్రమే పిచ్ పైకి వెళ్ళాల్సి ఉంటుంది. కాని ఫోర్టిస్ మాత్రం ఇంగ్లాండ్ కోచ్ మెక్ కల్లం తో కలిసి పిచ్ పై నడిచాడు. ఇద్దరూ పిచ్ పై నిలబడి మాట్లాడుకున్నారు. ఈ ఫోటోలు రిలీజ్ అయ్యాయి. ఆ పిచ్ మీద భారత్ ను రావొద్దని చెప్పి.. ఇంగ్లాండ్ స్టాఫ్ ఎలా వెళ్తుంది అనేది ప్రధాన ప్రశ్న. దీనిపై భారత మాజీ ఆటగాళ్ళు మండిపడుతున్నారు. ఇంగ్లాండ్ డబుల్ స్టాండర్డ్స్ ప్రదర్శిస్తోందని.. రూల్స్ భారత్ కే గాని వాళ్లకు లేవా అంటూ ఫైర్ అవుతున్నారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

కేటీఆర్ కు రేవంత్...

భారత రాష్ట్ర సమితి విషయంలో ముఖ్యమంత్రి...

జగన్ పరువును వారే...

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అంటే.....

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

పోల్స్