Friday, September 12, 2025 11:20 PM
Friday, September 12, 2025 11:20 PM
roots

1971 తర్వాత తొలిసారి.. ఆపరేషన్ సిందూర్ తో పాక్ కు చుక్కలు

జమ్మూ కాశ్మీర్ లో పాకిస్తాన్ ఉగ్రవాదులు చేసిన దాడికి భారత ఆర్మీ బుధవారం తెల్లవారుజామున పాకిస్తాన్ భూ భాగంలో దాడులకు దిగింది. ఉగ్రవాద స్తావరాలే లక్ష్యంగా పాకిస్తాన్ లో దాడులు చేసింది భారత ఆర్మీ. పెద్ద ఎత్తున ఉగ్రవాదులను మట్టుబెట్టింది. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం.. 80 మంది ఉగ్రవాదులను హతమార్చింది భారత్. తెల్లవారుజామున 3 గంటలకు భారత ఆర్మీ జరిపిన దాడుల్లో ఉగ్రవాద క్యాంపులను కూడా నాశనం అయ్యాయి. ఈ విషయాన్ని పాకిస్తాన్ అంగీకరించింది.

Also Read : పాకిస్థాన్ దాడులు.. తెలుగు రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం..?

తమ భూ భాగంలో భారత ఆర్మీ దాడులకు దిగిందని ప్రకటించింది. భారత్‌ మెరుపుదాడులతో పాకిస్తాన్‌లో అలజడి రేగింది. లాహోర్‌, సియాల్‌కోట ఎయిర్‌పోర్ట్‌లు మూసివేసారు. ఇస్లామాబాద్‌, రావల్పిండిలో మెడికల్‌ ఎమర్జెన్సీ ప్రకటించింది. వైద్య సిబ్బందికి సెలవులు రద్దు చేసిన పాక్‌ అధికారులు… పాక్‌ పంజాబ్‌లో విద్యాసంస్థలు మూసివేయాలని ఆదేశాలు ఇచ్చారు. 1971 తర్వాత తొలిసారి పాకిస్థాన్‌ భూభాగంలో దాడులు జరిపింది భారత్. ఇక మన దేశంలో కూడా పలు విమానాశ్రయాలను మూసివేసారు.

Also Read : టీడీపీ సోషల్ మీడియాకు గుర్రంపాటి బెదిరింపులు

ఉద్రిక్తలతో దేశంలోని 9 ఎయిర్‌పోర్ట్‌లను మూసివేసారు. ధర్మశాల, లే, జమ్మూ, శ్రీనగర్‌, అమృతసర్‌తో, చండీగఢ్ సహా కీలక విమానాశ్రయాల్లో విమానల రాకపోకలు రద్దు చేసారు. 9 నగరాలకు విమానాల రాకపోకల రద్దు చేసింది ఎయిరిండియా. ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల వరకు అన్ని విమానాలు రద్దు చేసారు. ఇదిలా ఉంటే ఉగ్ర స్థావరాలపై దాడులను పలుదేశాలకు భారత్‌ వివరించింది. అమెరికా, యూకే, సౌదీ అరేబియా, యూఏఈ, రష్యా సహా పలు దేశాలకు ఉగ్రస్థావరాలపై దాడులను వివరించింది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్