Saturday, September 13, 2025 05:12 AM
Saturday, September 13, 2025 05:12 AM
roots

కర్రెగుట్టల్లో యుద్దమే.. రంగంలోకి 24 వేల మంది బలగాలు

2026 మార్చి నాటికి వామపక్ష తీవ్రవాదాన్ని పూర్తిగా నిర్మూలించాలన్న హోంమంత్రి అమిత్ షా లక్ష్యానికి అనుగుణంగా… తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దులోని కర్రెగుట్టలను చుట్టుముట్టి మావోయిస్ట్ ల కోసం పెద్ద ఎత్తున గాలింపు చేపట్టాయి భద్రతా బలగాలు. సుమారు 24,000 మంది భద్రతా సిబ్బంది వారం నుంచి వేటాడుతున్నారు. 800 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈ కొండలను మావోలకు పెట్టని కోటగా చెప్తారు. అధునాతన పేలుడు పరికరాలను పెద్ద ఎత్తున గుర్తించారు.

Also Read : కాశ్మీర్ లో టూరిస్ట్ ప్లేస్ లు క్లోజ్.. భారీగా బలగాల మోహరింపు

కర్రెగుట్ట కొండలలో అనేక మావోయిస్టుల స్థావరాలు బయటపడ్డాయని, వాటిలో ఒక పెద్ద గుహ, బంకర్లు, ఆయుధ నిల్వలు ఉన్నాయని ఆపరేషన్‌ను పర్యవేక్షిస్తున్న ఒక సీనియర్ పోలీసు అధికారి జాతీయ మీడియాకు వెల్లడించారు. కర్రెగుట్ట కొండలు ఛత్తీస్‌గఢ్‌లోని దక్షిణ బస్తర్‌లోని బీజాపూర్ జిల్లా నైరుతి భాగం నుంచి పొరుగున ఉన్న తెలంగాణ వరకు విస్తరించి ఉన్నాయి. మొత్తం 24 వేల మంది ఈ దాడుల్లో పాల్గొంటున్నారు. కొండల్లో దాక్కున్న నక్సల్ కమాండర్లను పెద్ద ఎత్తున వేటాడుతున్నారు.

Also Read : బాబును తిడితేనే పెద్ద పదవులు..!

గత వారంలో, మావోయిస్టులకు, భద్రతా బలగాలకు మధ్య కాల్పులు జరిగాయి. అందులో 30 మంది మావోలు మరణించారు అనే ప్రచారం జరిగింది. కానీ మరణించిన మహిళా మావోయిస్టుల మృతదేహాలు ముగ్గురిని మాత్రమే స్వాధీనం చేసుకున్నారు. భారీగా మావోలు ప్రాణాలు కోల్పోయారని నిఘా వర్గాలు అంటున్నాయి. మావోయిస్ట్ అగ్ర నాయకులు ఇప్పటికీ ఈ ప్రాంతంలో దాక్కునే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. మావోయిస్టులు వదిలిపెట్టిన ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైజ్‌లు, ప్రెజర్ బాంబులను తొలగించడం భద్రతా దళాలకు సవాల్ గా మారింది. ఈ ఆపరేషన్ లక్ష్యం దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ, తెలంగాణ స్టేట్ కమిటీ, పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీలను నిర్మూలించడమే లక్ష్యంగా ఈ దాడులు సాగుతున్నాయి.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్