Saturday, September 13, 2025 01:20 AM
Saturday, September 13, 2025 01:20 AM
roots

ఇప్పుడు ఆ అధికారిని ఏం చేస్తారో…?

ఆంధ్రప్రదేశ్ లో గత ప్రభుత్వం ఏ రేంజ్ లో అవినీతి చేసింది అనేది పక్కన పెడితే అధికారులు మాత్రం అందినకాడికి దోచుకున్నారు అనేది వాస్తవం. ఏ రూపంలో ఛాన్స్ ఉంటే ఆ రూపంలో దోచుకున్నారు. ఆర్ధిక శాఖలో అయితే భారీ ఎత్తున నిధులు మాయం చేసారు. ఈ నేపధ్యంలో గత ప్రభుత్వ హయాంలో ఆర్థికశాఖ కార్యదర్శిగా పని చేసిన కె.వి.వి. సత్యనారాయణ సాగించిన అవకతవకలు, అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం విచారణ మొదలుపెట్టింది. రైల్వే ఎకౌంట్స్ విభాగంలో అధికారిగా పని చేస్తూ రాష్ట్రానికి డిప్యుటేషన్ పై వచ్చిన సత్యనారాయణ పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారు.

Also Read : ఈ లెక్కలు చూస్తే కోహ్లీ, రోహిత్ కంటే పుజారా, రహానే బెస్ట్

నాటి ప్రభుత్వంలో ఆర్థిక శాఖలో ఇష్టారాజ్యంగా వ్యవహరించారంటూ అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ కేంద్ర ప్రభుత్వంలో డిపార్ట్ మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ (డీఓపీటీ) డైరెక్టర్ కు ఫిర్యాదు చేసారు. డీఓపీటీ ఆ ఫిర్యాదును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పంపింది. సాధారణ పరిపాలనా శాఖ ఆ అవినీతిపై ఫిర్యాదులు నమోదు చేసి, దస్త్రం రూపొందించి తదుపరి చర్యల కోసం ఆర్థికశాఖకు పంపింది. మరోవైపు సత్యనారాయణ డిప్యుటేషన్ పూర్తి కావడంతో తిరిగి వచ్చి సర్వీసులో చేరాలంటూ రైల్వే శాఖ నుంచి ఆదేశాలు రావడం గమనార్హం.

Also Read : వారిద్దరి కష్టం… బూడిదలో పోసిన పన్నీరేనా..?

ప్రస్తుత బాధ్యతల నుంచి రిలీవ్ చేయాలంటే ఈ విచారణ పూర్తి కావాలని ప్రభుత్వం చెప్తోంది. అయితే సత్యనారాయణను రిలీవ్ చేసి పంపేందుకు ఏర్పాట్లు దాదాపు సిద్ధం కావడం ఆశ్చర్యం కలిగిస్తోంది. గత ప్రభుత్వంలో ఆయన నిర్ణయాలు తీవ్ర వివాదాస్పదం అయ్యాయి. ఎంపీ సీఎం రమేష్ చేసిన ఆరోపణల్లోని అంశాలను అభియోగాలుగా నమోదు చేసి, తొలుత ఆ అధికారి వివరణ కోరాలని నిర్ణయం తీసుకున్నా అది జరగలేదు. ప్రభుత్వ పెద్దలు, బిజెపి సీరియస్ గా ఉండటంతో ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ తన కార్యాలయం లోనే ప్రత్యేక అధికారిగా పని చేస్తున్న కె.వి.వి.సత్యనారాయణను ఈ అభియోగాలపై పది రోజుల్లోగా వివరణ ఇవ్వాలని నోటీసులు జారి చేసారు. సమాధానం తర్వాత ఏం చేయాలనేది నిర్ణయం తీసుకోనున్నారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్