వైసిపి అధిష్టానం తీరు నచ్చక కొంతమంది ఆ పార్టీ భవిష్యత్తు కనపడక మరికొంతమంది ఆ పార్టీని వీడుతున్నారు. పార్టీలో కీలక నాయకులుగా చెప్పుకునే వారు చాలామంది ఆ పార్టీలో ఉండేందుకు ఇష్టపడటం లేదు. క్షేత్రస్థాయిలో పార్టీ బలంగా లేదనే సంకేతాలు కూడా ఆ పార్టీ నాయకులను ఇబ్బంది పెడుతున్నాయి. దీనితో చాలా మంది నాయకులు ఈ మధ్యకాలంలో వైసీపీ కండువా కప్పుకోవడానికి ఇష్టపడటం లేదు అనే విషయం స్పష్టంగా అర్థం అవుతుంది. ముఖ్యంగా చాలా జిల్లాల్లో మున్సిపాలిటీలు ఖాళీ అయిపోతున్నాయి. తాజాగా మరో మున్సిపాలిటీ లో వైసీపీ ఇబ్బంది పడే సంకేతాలు వచ్చాయి.
Also Read : వైసీపీలో సాయిరెడ్డి రీప్లేస్‌మెంట్..!
ఉమ్మడి కృష్ణా జిల్లాలో నూజివీడు నియోజకవర్గంలో మేక వెంకట ప్రతాప్ అప్పారావు బలమైన నాయకుడుగా ఉన్నారు. ఏలూరు పార్లమెంట్ లో వైసీపీకి నమ్మదగ్గ స్థానంగా నూజివీడు చెప్పేవారు. అలాంటి నూజివీడు నియోజకవర్గంలో ఇప్పుడు వైసీపీ కోటలు బీటలు వారే పరిస్థితి కనపడుతోంది. మాజీ ఎమ్మెల్యే అప్పారావు నాయకత్వాన్ని ఇష్టపడని ఆ పార్టీ కార్పొరేటర్లు పార్టీ మారేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. త్వరలోనే టీడీపీ కండువా కప్పుకోవడానికి సిద్ధమయ్యారు. ఇప్పటికే నూజివీడు ఎమ్మెల్యే మంత్రి పార్థసారధితో కొంతమంది వైసీపీ నాయకులు భేటీ అయి పార్టీ మార్పు గురించి చర్చించినట్లుగా సమాచారం.
Also Read : పెద్దిరెడ్డికి దండం పెట్టిన చిత్తూరు వైసీపీ
వైసీపీని వీడి టిడిపిలో చేరేందుకు మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ పగడాల సత్యనారాయణ అలాగే మరి కొంతమంది వైసీపీ కార్పొరేటర్లు సిద్ధంగా ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక నేపథ్యంలో నూజివీడు మున్సిపల్ వైసీపీ కార్పొరేటర్లు పార్టీ మారుతున్నారని వార్తలు వస్తున్నాయి. ఎంతమంది వైసీపీ కార్పొరేటర్లు టిడిపిలో చేరతారనే దానిపై స్పష్టత రాకపోయినా వైసిపి కౌన్సిలర్లు పార్టీ మారితే మాత్రం కచ్చితంగా నూజివీడు మున్సిపాలిటీలో ఎమ్మెల్యే ప్రతాప్ అప్పారావు కోటలో బీటలు వారినట్లే అని చెప్పవచ్చు.