Saturday, September 13, 2025 12:53 AM
Saturday, September 13, 2025 12:53 AM
roots

టీం ఇండియాకు వెన్నెముకగా మారిన తెలుగోడు

ఆస్ట్రేలియా పర్యటనలో తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి దుమ్ము రేపుతున్నాడు. టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా నితీష్ కుమార్ రెడ్డి బ్యాటింగ్ లో భారత్ కు కీలకంగా మారాడు. మొదటి టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో అలాగే రెండో ఇన్నింగ్స్ లో నితీష్ కుమార్ రెడ్డి 38 అలాగే 42 పరుగులతో రాణించిన సంగతి తెలిసిందే. ఇక రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో కూడా నితీష్ కుమార్ రెడ్డి చాలా కంఫర్టబుల్ గా బ్యాటింగ్ చేశాడు. తన శైలిలో ఆస్ట్రేలియా బౌలర్లకు చుక్కలు చూపించాడు.

Also Read : దట్ ఈజ్ రోహిత్… రాహుల్ కోసం ఓపెనింగ్ ప్లేస్ వదిలేసాడు

భారత్ కనీసం 150 పరుగులు అయినా చేస్తుందా అనే తరుణంలో భారత్ ను తన దూకుడైన బ్యాటింగ్ తో 180 పరుగుల వరకు తీసుకెళ్లాడు. దీనితో తొలి ఇన్నింగ్స్ లో భారత్ కాస్త గౌరవప్రదమైన స్కోర్ చేసింది. సీనియర్ ఆటగాడు అశ్విన్ తో కలిసి మంచి భాగస్వామ్యం నెలకొల్పాడు. ఓవైపు వికెట్లు పడుతున్నా సరే ఆస్ట్రేలియా బౌలర్లపై విరుచుకుపడ్డాడు. స్కాట్ బోలాండ్ ఓవర్లో ఏకంగా 20 పరుగులు రాబెట్టాడు నితీష్ కుమార్ రెడ్డి. భారత్ 180 పరుగులు చేయగా అందులో నితీష్ చేసినవే 42 పరుగులు.

Also Read : ఫస్ట్ డే పుష్ప 2 రికార్డుల జాతర

నితీష్ ఆడకపోయి ఉంటే ఆ మాత్రం కూడా స్కోర్ చేసి ఉండేది కాదు భారత్. ఇక ప్రాక్టీస్ మ్యాచ్లో కూడా నితీష్ బ్యాటింగ్ లో మంచి ప్రదర్శన చేశాడు. దీనితో ఈ సీరీస్ లో నితీష్ ఆస్ట్రేలియాను కచ్చితంగా ఇబ్బంది పెట్టవచ్చు. క్రికెట్ అనలిస్టులు అభిప్రాయపడుతున్నారు. అటు బౌలింగ్ లో కూడా రాణిస్తే భారత్ కు చాన్నాళ్ల తర్వాత ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్ దొరికినట్లే. భారత్ కంటే విదేశీ పర్యటనలో ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్ అవసరం ఎక్కువగా ఉంటుంది. అందుకే ఇప్పుడు భారత్ నితీష్ కుమార్ రెడ్డికి ఎక్కువ అవకాశాలు ఇచ్చి పదును పెట్టాలని భావిస్తోంది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్