Friday, September 12, 2025 05:26 PM
Friday, September 12, 2025 05:26 PM
roots

ఆ అహంకారమే.. ఈ పరిస్థితికి కారణం..!

నోరా వీపునకు చెప్పు దెబ్బ అన్నారు పెద్దలు. నిజమే.. ఇది ఎవరికైనా ఈ మాట సరిగ్గా సరిపోతుంది. రాజకీయాల్లో ఉన్నాం కదా అని నోటికి ఏది వస్తే అది మాట్లాడితే ఓటర్లు ఓటుతో బుద్ది చెప్తారు. అధికారం కోసం ప్రత్యర్థులను కించపరిచేలా మాట్లాడటం ఇప్పుడు చాలా మందికి ఫ్యాషన్ అయిపోయింది. అయితే ఈ విషయంలో ఉత్తరాధి పార్టీల నేతలు చాలా బెటర్. దక్షిణ భారతంలో.. మరి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన నేతలు మాత్రం మరీ దిగజారి మాట్లాడుతున్నారు. స్థాయి మరిచి మరీ ఎదుటి వారి వయసుకు కూడా విలువ ఇవ్వకుండా వ్యాఖ్యలు చేస్తున్నారు.. చీవాట్లు తింటున్నారు కూడా.

Also Read : తల్లికి వందనంపై గుడ్ న్యూస్.. పక్కా ప్లాన్ తో దిగుతున్న సర్కార్

తెలంగాణలో రాజకీయాలు హాట్ హాట్‌గా మారాయి. బీఆర్ఎస్ సర్కార్ పదేళ్ల పాలనలో లక్ష కోట్లు వృధా చేసి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించిందని.. దీని వల్ల కనీసం ఒక్క ఎకరాకు కూడా నీరు రాలేదనేది కాంగ్రెస్ నేతల మాట. ఇక 2023 ఎన్నికలకు సరిగ్గా నెల రోజుల ముందు కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోయింది. ఇది కూడా కాంగ్రెస్ గెలుపునకు కారణమైంది. ఇక రేవంత్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై విచారణకు ఆదేశించింది. ఇప్పటికే మాజీ మంత్రి హరీష్ రావును విచారించిన కమిషన్.. కేసీఆర్‌ను కూడా కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్ ప్రశ్నించారు. కమిషన్ ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన కేసీఆర్.. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన పుస్తకాన్ని అందించారు.

Also Read : అమరావతి రైతులపై దాడి చేయమన్నాడు.. బాంబు పేల్చిన కోటంరెడ్డి

9 ఏళ్ల పాటు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వ్యవహరించిన కేసీఆర్‌ను ఇలా విచారించడం బీఆర్ఎస్ శ్రేణులకు నచ్చలేదు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆయన ప్రాణాలను పణంగా పెట్టారని.. అలాగే తెలంగాణ అభివృద్ధి కోసమే కేసీఆర్ పని చేశారని విచారణ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. తన తండ్రిని సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్ చేశారన్నారు. మరో అడుగు ముందుకు వేసిన కేటీఆర్.. సీఎం రేవంత్ రెడ్డిపై ఇష్టం వచ్చినట్లు వ్యాఖ్యలు చేశారు. రాయలేని బాషలో రెచ్చిపోయారు. తానోక మాజీ మంత్రిని అని.. ఒక రాజకీయ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్‌గా పని చేస్తున్నా అనే కనీస విషయం కూడా మర్చిపోయిన కేటీఆర్.. నీ అంతు చూస్తానంటూ వార్నింగ్ ఇచ్చారు కూడా.

Also Read : పొగాకు రైతుపై రౌడీమూకల తాండవం..!

మరో అడుగు ముందుకు వేసిన కేటీఆర్.. అసలు సంబంధమే లేని చంద్రబాబుపై పరోక్షంగా నోరు పారేసుకున్నారు. వంద జన్మలు ఎత్తినా కూడా రేవంత్‌రెడ్డి అనే చిల్లర గాడికి కేసీఆర్ గొప్పతనం అర్థం కాదని.. రేవంత్ గురువు, ఆయన జేజమ్మతో గొడవ పడి ఇక్కడి నుంచి తరిమినా వాడే కేసీఆర్ అంటూ నోరు పారేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత ముఖ్యమంత్రి స్థాయి వరకు ఎదిగిన తర్వాత కూడా చంద్రబాబు తనకు రాజకీయ గురువు అని రేవంత్ ఎన్నోసార్లు బహిరంగంగానే ప్రకటించారు. రెండు రోజుల క్రితం కూడా తాను మోదీ స్కూల్‌లో చంద్రబాబు కాలేజీలో చదువుకుంటే.. రాహుల్ గాంధీ తనకు ఉద్యోగం ఇచ్చారన్నారు. అందుకే రేవంత్‌ గురువు అంటూ పరోక్షంగా చంద్రబాబు గురించి కేటీఆర్ అహంకారం చూపించారు.

Also Read : కామెడీ అయిపోతున్న జగన్.. ఎందుకిలా..?

కేటీఆర్ వ్యాఖ్యలపై టీడీపీ నేతలు, నెటిజన్లు ఘాటుగా బదులిస్తున్నారు. రేవంత్ రెడ్డి కంటే కూడా చంద్రబాబు దగ్గర కేసీఆర్ ఎక్కువ కాలం పని చేశారని గుర్తు చేస్తున్నారు. జేజమ్మ కొట్టిన దెబ్బకు బాత్‌రూంలో కాలు జారి పడ్డాడని.. బయటకు రావడానికి ఏడాదిన్నర పట్టిందని ఎద్దేవా చేస్తున్నారు. 2009 ఎన్నికల్లో నీ మెడలో ఎన్ని కండువాలు ఉన్నాయో నీకు తెలియదా అని కేటీఆర్ పాత ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఇతరులను కించపరిస్తే అది గొప్పతనం అనుకుంటే తప్పు… అది రాజకీయం కాదు.. అహంకారం అవుతుందని గుర్తు పెట్టుకో అంటూ పోస్టు పెడుతున్నారు. అహంకారం ఉన్న వాళ్లు రాజకీయాల్లో ఎదిగిన దాఖలాలు లేవన్నారు. కేటీఆర్‌కు ఇంకా అధికారం అనుభవించిన అహంకారమే కనిపిస్తోంది కానీ.. ప్రజాస్వామ్యంలో ఉన్నామనే కనీస స్పృహ లేదని వ్యాఖ్యానిస్తున్నారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

హైదరాబాద్ నుంచి వైసీపీ...

వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే ఫోకస్ పెడుతున్న...

ఇదేం ప్రెస్ మీట్...

రాజకీయ నాయకులు మీడియా సమావేశాలు నిర్వహించడం,...

లోకేష్ అదుర్స్.. వార్...

నేపాల్ పరిస్థితుల నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...

పోల్స్