Wednesday, October 22, 2025 06:24 PM
Wednesday, October 22, 2025 06:24 PM
roots

కాంగ్రెస్ ఎన్నికల హామీల్లో నిరుద్యోగులు, యువతకు ప్రాధాన్యం.. ఉద్యోగాలు, ఉపాధి సహా 10 వాగ్దానాలు

లోక్‌సభ ఎన్నికలకు సమయం ఆసన్నమవుతున్న కొద్దీ.. పార్టీలు జోరు పెంచాయి. ఇప్పటికే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. వచ్చే ఎన్నిక్లలో పోటీ చేయనున్న అభ్యర్థులకు సంబంధించిన 195 మందితో తొలి విడత జాబితాను విడుదల చేసింది. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. బీజేపీ అగ్రనేతలు, కేంద్రమంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా తమ తమ పరిధిలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. మరోవైపు.. ఇండియా కూటమిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ.. పొత్తులు, సీట్ల సర్దుబాటు, నేతల అలకలతో తీవ్ర సతమతం అవుతోంది. ఓ వైపు ఎన్నికల నోటిఫికేషన్ త్వరలోనే వెలువడనుందనే వార్తలు వస్తుండగా.. అభ్యర్థుల ఎంపిక, సీట్ల సర్దుబాటు.. ఆ పార్టీకి పెను సవాల్‌గా మారింది. ఈ నేపథ్యంలోనే లోక్‌సభ ఎన్నికల హామీలను విడుదల చేయాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. త్వరలోనే రాహుల్ గాంధీతో ఆ ప్రకటన చేయించనున్నట్లు సమాచారం.

కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోదీ సర్కార్‌ను పదే పదే దేశంలో పెరిగిపోతున్న నిరుద్యోగం, ద్రవ్యోల్బణం లక్ష్యంగా చేసుకుని కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే వచ్చే లోక్‌సభ ఎన్నికలకు వీటినే ఎన్నికల హామీలుగా మేనిఫేస్టోలో చేర్చాలని భావిస్తోంది. దీంతో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి 10 అంశాలతో కూడిన హామీలను విడుదల చేయించాలని హస్తం పార్టీ యోచిస్తోంది. ప్రస్తుతం రాహుల్ గాంధీ నిర్వహిస్తున్న భారత్ జోడో న్యాయ్ యాత్ర మధ్యప్రదేశ్‌లో కొనసాగుతుండగా.. బద్నవార్‌ జిల్లాలో ఈ ప్రకటన చేయనున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఈ ర్యాలీలో రాహుల్ గాంధీతోపాటు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే కూడా హజరు కానున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

ముఖ్యంగా దేశంలో నిరుద్యోగ యువత పెరిగిపోయి.. ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లేకుండా పోయాయని గుర్తించిన కాంగ్రెస్ పార్టీ.. నిరుద్యోగ యువతను తమవైపు తిప్పుకునేలా ఎన్నికల హామీలను రూపొందించనున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే తాము అధికారంలోకి వస్తే 30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. దీంతోపాటు కాంగ్రెస్ పార్టీ దేశంలో అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా కుల గణన నిర్వహిస్తామని హామీ ఇచ్చింది. ఈ క్రమంలోనే దేశంలో పూర్తి స్థాయిలో ఎన్నికల ప్రచారాన్ని చేపట్టేలా క్షేత్రస్థాయిలో లక్ష మంది బూత్ లెవల్ ఏజెంట్లను కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే నియమించింది. ఈ ఏడాది ఏప్రిల్-మే నెలల్లో లోక్‌సభ ఎన్నికలు జరిగే అవకాశం ఉందని ఎన్నికల సంఘం వర్గాల ద్వారా తెలుస్తోంది.

మరోవైపు.. ఎన్నికలు దగ్గరపడుతుండటం, ఇప్పటికే బీజేపీ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసి మరో జాబితా వెలువరించేందుకు సిద్ధం అవుతుండగా.. కాంగ్రెస్ పార్టీ కూడా అప్రమత్తం అయింది. ఈ క్రమంలోనే కేరళ, కర్ణాటక రాష్ట్రాలకు సంబంధించి లోక్‌సభకు పోటీ చేసే అభ్యర్థుల జాబితా తుది దశకు చేరుకుందని.. గురువారం మల్లిఖార్జున ఖర్గే నేతృత్వంలోని కాంగ్రెస్ ఎలక్షన్ కమిటీ సమావేశం అయి వాటిని ఫైనల్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం అధ్యక్షతన మేనిఫేస్టో కమిటీ ఏర్పాటు చేయగా.. ఆ మేనిఫేస్టోను కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో చర్చించి అధ్యక్షుడికి అందజేయనున్నారు.

 

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

నా తండ్రికి ఆమె...

జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక రోజు...

బ్రేకింగ్: డీఎస్పీకి అండగా...

తెలుగు రాష్ట్రాల్లో జూదం, కోడి పందాలు...

ఎమ్మెల్యే బావమరిదిని కంట్రోల్...

రాజకీయ నాయకుల అవినీతి వ్యవహారాల విషయంలో...

జోగి రమేష్ సంగతేంటి..?...

ఆంధ్రప్రదేశ్ కల్తీ మద్యం కేసు వెనకడుగు...

డీఎంకే నేతలతో కలిసి...

ఆంధ్రప్రదేశ్ కల్తీ మధ్య వ్యవహారానికి, తమిళనాడు...

పర్యటన తెచ్చిన తంటాలు..!

ఒక పర్యటన ఇప్పుడు సిక్కోలు జిల్లా...

పోల్స్