Friday, September 12, 2025 10:39 PM
Friday, September 12, 2025 10:39 PM
roots

విశాఖ కు మోడీ.. ఏపీ కి వరాలిస్తాడా..?

ఈ నెల 8వ విశాఖలో ప్రధాన మోదీ పర్యటించనున్నారు. ఇందుకోసం ఏపీ సర్కార్ భారీ ఏర్పాట్లు చేస్తోంది. పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారి ఏపీకి వస్తున్న ప్రధాని మోదీకి గ్రాండ్‌గా వెల్‌కమ్ చెప్పాలని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారు. విశాఖలో భారీ రోడ్ షో ప్లాన్ చేశారు. ఈ రోడ్ షో‌లో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా పాల్గొనేలా రూట్ మ్యాప్ రూపొందించారు. విశాఖలో ప్రధాని మోదీ పర్యటన దాదాపు 4 గంటల పాటు సాగనుంది. దీంతో ఈ పర్యటనను తమకు అనుకూలంగా మలుచుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది.

Also Read : ఇండియాలో స్టార్ లింక్ పని చేస్తుందా..? అలెర్ట్ అయిన ఆర్మీ…!

ప్రధాని విశాఖ పర్యటన ఏర్పాట్లను మంత్రి నారా లోకేష్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే విశాఖలో పర్యటించిన లోకేష్.. ప్రధాని పర్యటనపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. భారీ రోడ్ షోలో వేలాదిగా జనం పాల్గొనేలా చూస్తున్నారు. ఇక ఏయూ గ్రౌండ్‌లో లక్షమందితో బహిరంగ సభ నిర్వహించాలని ప్రణాళికలు రూపొందిస్తున్నారు. మోదీ విశాఖ పర్యటనలోనే పలు కీలక ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు జరగనున్నాయి.

Also Read : మాకేం తెలియదంటున్న మంత్రులు… నిజమెంతా..?

విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ కేంద్ర కార్యాలయానికి మోదీ శంకుస్థాపన చేయనున్నారు. అలాగే అనకాపల్లి నుంచి పోర్టు వరకు జాతీయ రహదారి విస్తరణ, అలాగే రణస్థలం నుంచి ఇచ్ఛాపురం వరకు ఆరు వరుసలుగా విస్తరించిన జాతీయ రహదారి ప్రారంభం, బల్క్ డ్రగ్ పార్క్ ప్రారంభోత్సవం వంటి కీలక ప్రాజెక్టులను మోదీ ప్రారంభించనున్నారు. వేల కోట్ల విలువైన ప్రాజెక్టులు ప్రారంభిస్తుండటంతో ఉత్తరాంధ్ర, విశాఖ అభివృద్ధికి కూటమి సర్కార్ కట్టుబడి ఉందనే మాటను టీడీపీ, జనసేన నేతలు బలంగా ప్రచారం చేసుకోనున్నారు. మోదీ సభను గ్రాండ్ సక్సెస్ చేయాలనేలా కూటమి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్