Tuesday, October 28, 2025 01:39 AM
Tuesday, October 28, 2025 01:39 AM
roots

అమరావతిలో కొత్త పోలీస్ స్టేషన్.. ఎందుకంటే..!

ఆంధ్రప్రదేశ్ లో పెద్ద ఎత్తున గత 5 ఏళ్ళ డ్రగ్స్ తో పాటుగా గంజాయి వ్యవహారాలు జరగడంతో.. ఇప్పుడు వాటిని కట్టడి చేయడం ఏపీ ప్రభుత్వానికి సవాల్ గా మారింది. ముఖ్యంగా దేశంలో గంజాయి ఎక్కడ దొరికినా దాని మూలాలు రాష్ట్రంలోనే ఉండటం ఆందోళన కలిగించిన అంశంగా చెప్పాలి. ఇక కూటమి సర్కార్ వచ్చిన దగ్గరి నుంచి ఈ విషయంలో కఠినంగానే వ్యవహరిస్తున్నారు. సిఎం చంద్రబాబు దీనిపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. నేరాలకు గంజాయి ప్రధాన మూలం కావడంతో చర్యలు కఠినంగానే చేపడుతున్నారు.

Also Read : రజనీని కమ్మేస్తున్న కేసుల వల

హోం శాఖ కూడా దీనిపై పెద్ద ఎత్తున అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తోంది. ఈగల్ అనే ఒక టీం ను ఏర్పాటు చేసి మత్తు పదార్ధాలపై రాష్ట్ర వ్యాప్తంగా సోదాలు నిర్వహిస్తున్నారు. ఇటీవల అవనిగడ్డలో ఓ మెడికల్ షాపులో దొరికిన నిషేధిత మందులను పెద్ద ఎత్తున స్వాధీనం చేసుకున్నారు. ఉత్తరాంధ్రలో గంజాయిని కట్టడి చేసేందుకు డ్రోన్ లను కూడా ఏర్పాటు చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. గతంలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని కొందరు నాయకులు పెద్ద ఎత్తున రవాణా చేసిన నేపధ్యంలో వారిపై సర్కార్ గురి పెట్టింది.

Also Read : అగ్ని ప్రమాదంలో పవన్ కుమారుడు.. అసలేం జరిగింది..?

ఇదిలా ఉంచితే తాజాగా ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. అమరావతిలో నార్కోటిక్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. గంజాయి, డ్రగ్స్ కట్టడి కోసం అమరావతి కేంద్రంగా నార్కోటిక్ పోలీస్ స్టేషన్ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. దీనికి సంబంధించి గెజిట్ నోటిఫికేషనన్ను జారీ చేసింది ప్రభుత్వం. ఏపీ వ్యాప్తంగా గంజాయి లేదా డ్రగ్స్ కు సంబంధించిన కేసుల దర్యాప్తు అధికారం ఈ పీఎస్ పరిధిలో ఉంటుందని అందులో పేర్కొంది. స్టేషన్ హెడ్ గా డీఎస్పీ స్థాయి అధికారి ఉండనున్నారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.....

తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక...

ఐసీయూలో శ్రేయస్ అయ్యర్.....

సౌత్ ఆఫ్రికా తో కీలక వన్డే...

చావులోను ఆగని విష...

సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మానవత్వంతో...

గట్టిగానే సంక్రాంతి పోటీ.....

సంక్రాంతి పండుగ.. తెలుగు వారికి అతి...

బ్రేకింగ్: పరకామణి కేసులో...

గత కొన్నాళ్లుగా తిరుమలలో పరకామణి వ్యవహారం...

కొత్త జిల్లాలు.. మారనున్న...

ఏపీలో జిల్లాల పునర్‌ విభజన ప్రక్రియ...

పోల్స్