ఆంధ్రప్రదేశ్ కు పెట్టుబడులను ఆహ్వానించే విషయంలో దూకుడు ప్రదర్శిస్తోన్న రాష్ట్ర ప్రభుత్వం, వరుసగా కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ముఖ్యంగా విశాఖ వేదికగా భారీగా పెట్టుబడులను ఆకర్షించేందుకు, ముఖ్యంగా ఐటీ కంపెనీలకు స్వాగతం పలికేందుకు ఐటీ శాఖా మంత్రి నారా లోకేష్ ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు. భూముల కేటాయింపుతో పాటుగా పలు కీలక అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వం నిబంధనలను సరళం చేసింది. తాజాగా విశాఖలో మరో కార్యక్రమం నిర్వహించింది ఏపీ సర్కార్.
Also Read : ఆ విషయంలో వైసీపీ స్టాండ్ మారిందా..?
వైజాగ్ కన్వెన్షన్‌లో ఐసీఏఐ నేషనల్ కాన్ఫరెన్స్‌లో నారా లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన పారిశ్రామిక విప్లవం వచ్చిన ప్రతీసారి ఉద్యోగాలు పెరుగుతాయన్నారు. మన ముందు ఏఐ ఒక అవకాశంగా ఉంది.. మేము స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌పై దృష్టి పెట్టామని స్పష్టం చేసారు. ప్రపంచంలోనే అతిపెద్ద డేటా సెంటర్ విశాఖలో ఏర్పాటు కాబోతుందన్నారు లోకేష్. ఆంధ్రప్రదేశ్ రాజధాని గురించి కూడా లోకేష్ స్పష్టత ఇచ్చారు. ఏపీకి ఏకైక రాజధాని ఉంటుందన్నారు.
Also Read : బండి సంజయ్ కు హీరో ఇమేజ్.. అసలు ఏం జరిగింది..?
కాకపోతే అభివృద్ధి వికేంద్రీకరణ ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. ఏపీ వ్యక్తులు ఇండియాకే కాదు.. ప్రపంచానికే సేవలందించాలని ఆకాంక్షించారు. ఏపీని 2047 కల్లా 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థికవ్యవస్థగా మార్చడమే లక్ష్యమని స్పష్టం చేసారు. దేశంలో ఉత్పత్తి అవుతున్న ఏసీల్లో 50 శాతం నెల్లూరు నుంచే తయారవుతున్నాయన్నారు. ప్రకాశం జిల్లాను కంప్రెస్డ్ బయోగ్యాస్ క్యాపిటల్‌గా తయారు చేస్తామన్న ఆయన అనంతపురం జిల్లాను ఆటోమోటివ్ క్యాపిటల్‌గా తయారుచేస్తున్నామని తెలిపారు. కర్నూలు జిల్లాను పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి క్యాపిటల్‌గా మారుస్తున్నాం.. ఎలక్ట్రానిక్ మాన్యుఫ్యాక్చరింగ్ సంస్థలను కడప, చిత్తూరులో ఏర్పాటుచేస్తున్నామన్నారు. ఉత్తరాంధ్ర అద్భుతంగా అభివృద్ధి చెందబోతుంది.. అన్ని రంగాల్లో ఏపీని ప్రథమస్థానంలో ఉంచాలనే లక్ష్యంతో ఉన్నామన్నారు.




