Friday, September 12, 2025 11:08 PM
Friday, September 12, 2025 11:08 PM
roots

మరో దస్తగిరి గా నందిగం సురేష్

తెలుగుదేశం పార్టీపై దాడి కేసులో వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ ను పోలీసులు విచారిస్తున్న సంగతి తెలిసిందే. ఆయనను కస్టడీకి ఇస్తూ కోర్ట్ నేడు తీర్పు ఇచ్చింది. ఇక ఈ కేసులో లేళ్ళ అప్పిరెడ్డిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. వీరు ఇద్దరి నుంచి కీలక సమాచారం రాబట్టే దిశగా విచారణ సాగుతోంది. ఈ సమయంలో టీడీపీ నేత మాధగాని గురునాథం సంచలన వ్యాఖ్యలు చేసారు. నందిగామ సురేష్‌ ను జగన్ పరామర్శిండం పై గురునాథం చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఇవే మాటలు ఇప్పుడు వైసీపీ అభిమానుల గుండెల్లో రైళ్ళు పరిగేట్టిస్తున్నాయి కూడా.

వైసీపీ ఎమ్మెల్యే జగన్ రెడ్డి గుంటూరు జైల్లో ఉన్న నందిగామ సురేష్‌ ను ప్రేమతోనో, అభిమానంతోనో పరామర్శించలేదన్న ఆయన, పలు కీలక వ్యవహారాల్లో తన పేరు, సజ్జల పేరు బయటపెట్టకూడదని బెదిరించటానికి వెళ్లాడని ఆయన సంచలన వ్యాఖ్యలు చేసారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేయడంతో వైసీపీలో దుమారం రేగింది. తన స్వార్థ రాజకీయం కోసం తనని వాడుకున్నాడని తెలుసుకున్న నందిగామ సురేష్ అప్రూవర్‌గా మారనున్నారని సంచలన కామెంట్స్ చేసారు. జగన్‌కి తన దూతల ద్వారా నందిగం సురేష్ సందేశం పంపిస్తే.. ఆగమేఘాల మీద జగన్ పరుగెత్తుకుంటూ వచ్చాడన్నారు.

Read Also : చంద్రబాబుతో జూనియర్ భేటీ.. కారణాలు వేరేనా?

నందిగం సురేష్ మరో దస్తగిరి అవుతాడనే భయంతోనే జగన్ జైలుకు పరుగులు పెట్టారని ఆయన వ్యాఖ్యానించారు. రాజధాని అమరావతి నాశనానికి పథక రచయిత తానే అనే పేరు ఎక్కడ బయటపెడతాడో అనే భయం జగన్‌లో మొదలయిందన్న గురునాథం, నందిగం సురేష్ నిజాలు బయటపెడితే చంపివేస్తాడనే భయం ఆయన కుటుంబ సభ్యుల్లో ఉందని పేర్కొన్నారు. కాగా నందిగం సురేష్ ను ఈ నెల 15వ తేదీన మధ్యాహ్నం 12 గంటల నుంచి 17 మధ్యాహ్నం 1 గంట వరకు విచారించే అవకాశం కల్పించింది కోర్ట్. మరి పోలీసు కస్టడీలో సురేష్ ఏమి చెబుతారో, ఎలాంటి వాంగ్మూలం ఇస్తారో తెలియాలి అంటే కొన్ని రోజులు వేచి చూడక తప్పదు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్