Tuesday, October 28, 2025 06:56 AM
Tuesday, October 28, 2025 06:56 AM
roots

అదరగొట్టిన హైదరాబాద్ నవాబ్.. న్యూ బాల్ కింగ్

ఇంగ్లాండ్ పర్యటనలో మొదటిసారి భారత బౌలింగ్ సత్తా ఏంటో అర్ధమైంది. భారత బౌలర్ల దెబ్బకు ఇంగ్లీష్ బ్యాట్స్మెన్ కు చుక్కలు కనపడ్డాయి. బజ్ బాల్ వ్యూహాన్ని అమలు చేసి భారత్ ను దెబ్బ కొట్టాలని భావించిన ఇంగ్లాండ్ ఆటగాళ్ళు.. మన బౌలర్ల చేతికి కొత్త బాల్ రాగానే తోక ముడిచారు. మూడవ రోజు ఆదిలోనే సిరాజ్ దెబ్బకు ఇంగ్లాండ్ కు గట్టి దెబ్బ తగిలింది. జో రూట్, బెన్ స్టోక్స్ ను వరుస బంతుల్లో పెవిలియన్ కు పంపిన సిరాజ్, ఆ తర్వాత కాస్త ఇబ్బంది పడ్డాడు.

Also Read : నిన్ను కొట్టనురా.. వచ్చి కలువురా.. లారెన్స్ ఎమోషనల్

బంతి పాతది కావడం, పిచ్ బ్యాటింగ్ కు అనుకూలంగా ఉండటంతో ఇంగ్లాండ్ భారీగా పరుగులు చేసింది. స్మిత్, బ్రూక్ ఇద్దరూ 300 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. భారత కెప్టెన్ గిల్ బౌలర్లను మార్చి మార్చి ప్రయోగించినా సరే ఉపయోగం లేకుండా పోయింది. ఇక కొత్త బంతి అందుకున్న తర్వాత ఆకాష్ దీప్ చెలరేగిపోయాడు. బ్రూక్ ను అద్భుతమైన బంతితో పెవిలియన్ కు చేర్చాడు. అక్కడి నుంచి ఇంగ్లాండ్ పతనాన్ని శాసించాడు సిరాజ్. ఏ దశలో కూడా ఇంగ్లాండ్ ను కోలుకోనీయలేదు.

Also Read : గిల్ పై విషం కక్కుతున్న పాక్, బంగ్లా క్రికెట్ ఫ్యాన్స్

వోక్స్, జోష్ టాంగ్, కార్స్, బషీర్ ఇలా నలుగురిని వేగంగా పెవిలియన్ కు పంపాడు. బంతి నుంచి అందుతున్న సహకారాన్ని చక్కగా వినియోగించుకున్న ఈ హైదరాబాది పేస్ బౌలర్.. లైన్ లెంగ్త్ ఎక్కడా మిస్ అవ్వలేదు. ఇన్ స్వింగ్, అవుట్ స్వింగ్ తో అల్లాడించాడు. బూమ్రా ఉన్నప్పుడు పెద్దగా రాణించని సిరాజ్.. బూమ్రా లేని సమయంలో మాత్రం జట్టుకు కీలక బౌలర్ గా మారుతున్నాడు. బూమ్రా జట్టులో ఉంటే సిరాజ్ యావరేజ్ 33 కాగా బూమ్రా లేకపోతే 25. రెండో ఇన్నింగ్స్ లో కూడా సిరాజ్ చెలరేగితే మాత్రం ఇంగ్లాండ్ కు కష్టాలు తప్పవు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.....

తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక...

ఐసీయూలో శ్రేయస్ అయ్యర్.....

సౌత్ ఆఫ్రికా తో కీలక వన్డే...

చావులోను ఆగని విష...

సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మానవత్వంతో...

గట్టిగానే సంక్రాంతి పోటీ.....

సంక్రాంతి పండుగ.. తెలుగు వారికి అతి...

బ్రేకింగ్: పరకామణి కేసులో...

గత కొన్నాళ్లుగా తిరుమలలో పరకామణి వ్యవహారం...

కొత్త జిల్లాలు.. మారనున్న...

ఏపీలో జిల్లాల పునర్‌ విభజన ప్రక్రియ...

పోల్స్