ఏపీలో వైసీపీ నేతలు తమను తాను కాపాడుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. రాజకీయంగా వైసిపి బలహీనపడుతున్న క్రమంలో తమ రాజకీయ భవిష్యత్తు లేదంటే తమ వ్యక్తిగత భవిష్యత్తును కాపాడుకునేందుకు కొంతమంది కీలక నేతలు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఎన్ని రోజులు జగన్ ను నమ్ముకుని ఆయన కోసం ఏదైనా చేయడానికి సిద్ధమైన నాయకులు ఇప్పుడు తమకోసం ఆలోచించుకోవడానికి సమయం కేటాయిస్తున్నారు. ఒకప్పుడు మీడియా సమావేశాల్లో ఇష్టం వచ్చినట్లు మాట్లాడిన నాయకులు ఇప్పుడు మీడియాకు దూరంగా ఉంటూ తమ రాజకీయ భవిష్యత్తును కాపాడుకునేందుకు ఢిల్లీ స్థాయిలో ప్రయత్నాలు మొదలుపెట్టారు.
Also Read : మహేష్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్..!
అందులో చిత్తూరు జిల్లాకు చెందిన ఎంపీ మిధున్ రెడ్డి ముందు వరుసలో ఉంటారు. తన తండ్రిని ఖచ్చితంగా ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం ఇబ్బంది పెట్టే అవకాశం ఉండటంతో కాపాడుకునేందుకు మిథున్ రెడ్డి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక తనపై కూడా లిక్కర్ స్కాం విషయంలో తీవ్రస్థాయిలో ఆరోపణలు ఉండటంతో ఢిల్లీ స్థాయిలో రాజీ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో టిడిపిని చిత్తూరు జిల్లాలో నానా ఇబ్బందులు పెట్టారు మిథున్ రెడ్డి.
Also Read : ధర్మాన బ్రదర్స్ అంటే జగన్ కి మరీ ఇంత చులకనా..?
అయితే ఇప్పుడు చిత్తూరు జిల్లాలో పెద్ద ఎత్తున జరిగిన లిక్కర్ మాఫియాలో కీలకంగా ఉన్న నేపథ్యంలో ఓ బిజెపి ఎంపీ ద్వారా రాజీ కోసం ఢిల్లీ స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ స్థాయిలో పలుకుబడి ఉన్న సదరు బిజెపి ఎంపీ ద్వారా బిజెపి పెద్దలకు లేదంటే ఏపీలో ప్రభుత్వ పెద్దలకు దగ్గర కావాలని చూస్తున్నారట. దీని వెనక చిత్తూరు జిల్లాకు చెందిన ఓ కీలక నేత రాయబారం నడుపుతున్నట్లు సమాచారం. లిక్కర్ స్కాం విషయంలో సుప్రీంకోర్టులో బెయిల్ రావడంతో మిధున్ రెడ్డి ప్రస్తుతం కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. ఆయనను ఇప్పటిలో అరెస్టు చేసే అవకాశాలు కూడా దాదాపుగా లేవనే చెప్పాలి. ఈ సమయంలో కాస్త తనను తాను కాపాడుకునేందుకు మిథున్ రెడ్డి ప్రయత్నాల ముమ్మరం చేసినట్లు రాజకీయ వర్గాలు అంటున్నాయి. ఇటీవల పార్లమెంట్ సెంట్రల్ హాల్లో సదరు బిజెపి ఎంపీ తో దాదాపు అరగంట పాటు ఆయన భేటీ అయ్యారని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. సదరు బిజెపి ఎంపీ కి టిడిపి పెద్దలతో కూడా సన్నిహిత సంబంధాలు ఉండటంతో మిథున్ రెడ్డి ఆయన ద్వారా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.