Tuesday, October 28, 2025 01:25 AM
Tuesday, October 28, 2025 01:25 AM
roots

తెలంగాణాపై మీనాక్షి గురి.. యాక్ట్ చేస్తే తాట తీస్తాం..!

తెలంగాణా కాంగ్రెస్ లో నేతల మధ్య విభేదాలు, కోవర్టుల వ్యవహారంతో చికాకు పడుతున్న కాంగ్రెస్ అధిష్టానం.. రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ గా మీనాక్షి నట రాజన్ ను రంగంలోకి దించిన సంగతి తెలిసిందే. ఇక రెండు రోజుల నుండి గాంధీ భవన్ లో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు ఆమె. నిన్న ఉదయం మెదక్, మధ్యాహ్నం మల్కాజ్ గిరి పార్లమెంట్ నియోజకవర్గ నేతల తో ప్రత్యేక భేటీ అయ్యారు. ఈ రోజు ఉదయం, పీసీసి అధ్యక్షుడి తో కలిసి సీఎం తో సమావేశం అయ్యారు. కార్పొరేషన్ పోస్ట్ లు, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలు, పీసీసీ కమిటీలపై సీఎం తో చర్చించారు.

Also Read : రజనీ కేసులపై ఏసీబీ కీలక నిర్ణయం…!

అనంతరం గాంధీ భవన్ లో అనుబంధ సంఘాలతో భేటీ అయ్యారు. మధ్యాహ్నం ఆదిలాబాద్ పార్లమెంట్ నేతలతో భేటీ అయ్యారు. నేతల నుండి అభిప్రాయం తీసుకుంటున్న మీనాక్షి నటరాజన్.. పార్టీ లైన్ దాటితే వేటు తప్పదని హెచ్చరికలు జారీ చేసారు. అంతర్గత విషయాలు మీడియా ముందు మాట్లాడొద్దని అల్టిమేటం జారీ చేసారు. పార్టీలో కష్టపడ్డ వారికి కచ్చితంగా అవకాశం ఉంటుందని హామీ ఇచ్చారు. నియోజకవర్గాల వారిగా నేనే స్వయంగా డాటా తెప్పించుకుంటా అని చెప్పిన ఆమె.. ఎవరూ కంగారు పడవద్దని స్పష్టం చేసారు.

Also Read : రాజ్యసభ సీటుపై కూటమి సంచలన నిర్ణయం…?

ఇక అనుబంధ సంఘాల భేటీలో పనితీరు నివేదికలు ఇచ్చారు పలువురు నేతలు. మీరు నివేదికలు ఇవ్వకపోయినా ఎవరి పనితీరు ఏంటని తెలుసన్నారు ఆమె. పని చేస్తుంది ఎవరు… యాక్టింగ్ చేస్తుంది ఎవరనేది కూడా తెలుసు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు. పార్టీ కోసం సమయం ఇవ్వండని సూచించారు. పార్టీ అంతర్గత విషయాలు బయట చర్చ చేస్తే అలాంటి వారిపై చర్యలు తప్పవు అని హెచ్చరించారు. నా పనితీరు నచ్చకపోయినా… రాహుల్ గాంధీ…సోనియా గాంధీకి ఫిర్యాదు చేయొచ్చని కానీ బయట మాట్లాడకండన్నారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.....

తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక...

ఐసీయూలో శ్రేయస్ అయ్యర్.....

సౌత్ ఆఫ్రికా తో కీలక వన్డే...

చావులోను ఆగని విష...

సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మానవత్వంతో...

గట్టిగానే సంక్రాంతి పోటీ.....

సంక్రాంతి పండుగ.. తెలుగు వారికి అతి...

బ్రేకింగ్: పరకామణి కేసులో...

గత కొన్నాళ్లుగా తిరుమలలో పరకామణి వ్యవహారం...

కొత్త జిల్లాలు.. మారనున్న...

ఏపీలో జిల్లాల పునర్‌ విభజన ప్రక్రియ...

పోల్స్