దేశంలో మరో విద్యా కుంభకోణం సంచలనం రేపింది. పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడిన కేటుగాళ్ళను గుర్తించారు అధికారులు. విద్యావేత్తల ముసుగులో ప్రతిష్టాత్మక సంస్థలు బ్రష్టుపట్టిస్తున్నారు. నేషనల్ మెడికల్ కౌన్సెల్ స్కామ్ లో ఫాదర్ కొలంబో మెడికల్ హాస్పిటల్ పాత్ర ఉందని గుర్తించారు. వరంగల్ కు చెందిన ఫాదర్ కొలంబో మెడికల్ కాలేజ్ చైర్మన్ కొమిరెడ్డి జోసఫ్ ఫై సిబిఐ కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టింది. మెడికల్ కాలేజీ ల తనిఖీ కోసం పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి.
Also Read : బీఆర్ఎస్‌లో జూబ్లీహిల్స్ వార్..!
మెడికల్ కాలేజీలను తనిఖీలు చేసి అనుకూలంగా నివేదికలు ఇచ్చేందుకు లంచాలు తీసుకున్నట్టు తేల్చారు. నేషనల్ మెడికల్ కౌన్సెల్ స్కాం లో 36 మందిపై కేసులు నమోదు అయ్యాయి. ఆంధ్రప్రదేశ్ , తెలంగాణకు చెందిన డాక్టర్ల పాత్ర పై కేసు నమోదు చేసారు. కర్ణాటక ,రాజస్థాన్, మధ్యప్రదేశ్ ,ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ ,ఛత్తీస్గఢ్లో మెడికల్ కాలేజీ తనిఖీలలో అక్రమాలకు పాల్పడ్డారు. చత్తీస్గడ్ చెందిన శ్రీ రావత్పూర్ సర్కార్ మెడికల్ కాలేజ్ డాక్టర్లు బ్రోకర్లు మధ్యవర్తులుగా ఉన్నట్లు గుర్తించారు.
Also Read : అప్పుడు వైఎస్ సునీత, ఇప్పుడు సింగయ్య భార్య.. జగన్ ఫార్ములా
మెడికల్ కాలేజీలో తనిఖీలు చేసి డబ్బులు తీసుకున్నట్లుగా కొమ్మిరెడ్డిపై ఆరోపణలు వచ్చాయి. రెండు దఫాలుగా మెడికల్ కాలేజీ మధ్యవర్తి నుంచి ఫాదర్ కొమ్మిరెడ్డి కి డబ్బులు వెళ్ళాయి. విశాఖ గాయత్రి మెడికల్ కాలేజ్ డైరెక్టర్ నుంచి 50 లక్షల వసూలు చేసారు. డాక్టర్ కృష్ణ కిషోర్ ద్వారా ఢిల్లీకి హవాలా రూపంలో డబ్బులు తరలించినట్టు గుర్తించారు. మెడికల్ కాలేజీలో క్లియరెన్స్ కోసం ఫాదర్ కొలంబో కాలేజీ కి రెండు విడతలగా డబ్బులు చెల్లించారు.
Also Read : కుక్క పిల్లలా తోక్కేసారు.. చంద్రబాబు సంచలన కామెంట్స్
దక్షిణాది రాష్ట్రాల మెడికల్ కాలేజీల తనిఖీ కోసం డాక్టర్ వీరేంద్ర కుమార్ నియమించారు. అనంతపూర్ కదిరికి చెందిన డాక్టర్ హరిప్రసాద్ తో కలిసి ఈ అక్రమాలకు పాల్పడినట్టు తేల్చారు. హైదరాబాద్ చెందిన డాక్టర్ అంకం రాంబాబు విశాఖపట్నం చెందిన డాక్టర్ కృష్ణ కిషోర్లను మధ్యవర్తులుగా సిబిఐ గుర్తించింది. దీనిలో విజయవాడకు చెందిన ప్రముఖ డాక్టర్ పాత్ర కూడా ఉందని అనుమానిస్తున్న సిబిఐ అధికారులు, విజయవాడలో కూడా సోదాలు చేయనున్నట్టు వార్తలు వస్తున్నాయి.