మణిపూర్‌లో జరుగుతున్న హింసాత్మక ఘటనలలో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. అక్కడ ఇంటర్నెట్, మొబైల్ సేవలను నిలిపివేసినా కూడా కొందరు ఇంటర్నెట్ వాడుతున్నారని అంతర్జాతీయ మీడియా సంచలన విషయం బయటపెట్టింది. మిలిటెంట్ గ్రూపులు ప్రస్తుతం భారత్ లో లైసెన్స్ లేని ఎలన్ మస్క్ కు చెందిన ఉపగ్రహ ఆధారిత స్టార్ లింక్ పరికరాలను ఉపయోగిస్తున్నాయని, సాయుధ గ్రూపులను ఉద్దేశించి అంతర్జాతీయ మీడియా కథనం రాసింది. ఇండియాలో స్టార్ లింక్ శాటిలైట్ సిగ్నల్స్ రావని మస్క్ చెప్పిన కొన్ని రోజుల తర్వాత ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
Also Read : అయ్యన్న వారసుడు రెడీ.. ప్లాన్ సూపర్..!
గత నెలలో, భద్రతా దళాలు ఇంఫాల్ తూర్పు జిల్లాలోని కైరావ్ ఖునౌపై దాడి చేసి, ఆయుధాలు.. మందుగుండు సామగ్రితో పాటు ఇంటర్నెట్ పరికరాలను స్వాధీనం చేసుకున్నాయి. జప్తు చేసిన వస్తువులలో, స్టార్ లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ డివైజ్ కూడా ఉంది. భద్రతా సమస్యల నేపధ్యంలో భారత్ లో స్టార్ లింక్ కు అనుమతి ఇవ్వలేదు. అయితే మణిపూర్ కు పొరుగున ఉన్న మయన్మార్ దీనికి అనుమతి ఇచ్చినట్టు తెలిపారు. మణిపూర్‌లోని పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఆఫ్ మణిపూర్ (పిఎల్‌ఎ) ఉగ్రవాదులు ఈ డివైజ్ లు వాడుతున్నారట.
Also Read : ఎమ్మెల్యే గారి నోటి దూల.. కోపం గా టిడిపి క్యాడర్
ఈ సంస్థకు.. చెందిన నాయకుడు ఒకరు, మణిపూర్‌లో ఇంటర్నెట్‌ను యాక్సెస్ చేయడానికి స్టార్ లింక్ పరికరాలను ఉపయోగించారని అంతర్జాతీయ మీడియా పేర్కొంది. ముందు మయన్మార్‌లో స్టార్‌లింక్ పరికరాన్ని వాడారని.. కాని అది మణిపూర్ సరిహద్దులో కూడా పని చేస్తుందని గుర్తించారు. మణిపూర్‌లోని కొన్ని ప్రాంతాల్లో, ముఖ్యంగా మయన్మార్ సరిహద్దుకు దగ్గరగా ఉన్న కొన్ని ప్రాంతాల్లో స్టార్‌లింక్ నిజంగానే పనిచేస్తుందని స్థానిక పోలీసులు కూడా వెల్లడించారు. స్మగ్లర్లను నావిగేట్ చేయడానికి ఇంటర్నెట్ డివైజ్ ను వాడుతున్నట్టు పోలీసులు భావిస్తున్నారు.