మంచు కుటుంబ విభేదాలు మరోసారి రోడ్డు ఎక్కాయి. ఇటీవల కాస్త శాంతించిన రెండు వర్గాలు ఇప్పుడు మరోసారి రచ్చ లేపాయి. నిన్న నార్సింగి లో విష్ణు పై ఫిర్యాదు చేసాడు మంచు మనోజ్. తాను ఇంట్లో లేనప్పుడు తన కారుతోపాటు వస్తువులను దొంగిలించాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు. జల్ పల్లిలో ఇంటిలో కూడా 150 మంది చొరబడి విధ్వంసం చేశారని ఫిర్యాదు చేసాడు. నా ఇంటిలో ఉన్న విలువైన వస్తువులతోపాటు కార్లను ఎత్తుకొని వెళ్లారని ఆవేదన వ్యక్తం చేసాడు.
Also Read : ఇప్పుడేం వద్దు.. చంద్రబాబు, పవన్ కీలక నిర్ణయం..?
నా ఇంటి నుంచి చోరీ అయిన కార్లు విష్ణు ఆఫీసులో లభ్యమైనట్టు పేర్కొన్నాడు. నా ఇంట్లోకి గోడలు దూకి వచ్చి కార్లను ఎత్తుకొని వెళ్లారని.. ముఖ్యమైన వస్తువులన్నిటిని పగలకొట్టి విధ్వంసం చేశారన్నాడు. నా కూతురు బర్త్ డే కోసం తాను రాజస్థాన్ కి వెళ్లగా నా సోదరుడు నా ఇల్లుని ధ్వంసం చేశాడని ఆవేదన వ్యక్తం చేసాడు. నా ఇంట్లో జరుగుతున్న పరిణామాలపై తండ్రి మోహన్ బాబుతో మాట్లాడేందుకు ప్రయత్నించాను, మోహన్ బాబు మాట్లాడడానికి అందుబాటులోకి రాలేదన్నాడు.
Also Read : మొత్తం మీరే చేశారు.. ఇవిగో సాక్ష్యాలు..!
ఇక నేడు ఉదయం కూడా ఈ డ్రామా కొనసాగింది. జలపల్లి లోని నివాసం వద్దకు చేరుకున్న మనోజ్.. తనను లోపలి అనుమతించకపోవడం తో గెట్ ముందు కూర్చుని నిరసన వ్యక్తం చేసాడు. దీనితో పోలీసులు పెద్ద ఎత్తున మొహరించారు. మోహన్ బాబు నివాసం కి కిలోమీటర్ దూరంలో చెక్ పోస్ట్ ఏర్పాటు చేసాడు. ఎలాంటి గొడవలు జరగకుండా 100 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేయడమే కాకుండా మోహన్ బాబు ఇంటి పరిసర ప్రాంతాల్లో పోలీసుల ఆంక్షలు విధించారు. బయట వ్యక్తులను ఎవరిని కూడా లోపలి అనుమతించడం లేదు.




