ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసే అవకాశం ఉందనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ముఖ్యమంత్రి హోదాలో జగన్ ఆనాడు చేసిన అక్రమాలపై ఒక్కొక్కటిగా అధికారులు ఆధారాలతో సహా బయటపెడుతూ వస్తున్నారు. ఇప్పుడు మద్యం కుంభకోణంలో జగన్మోహన్ రెడ్డి పాత్ర అత్యంత కీలకంగా భావిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. ఆయన్ను అరెస్టు చేసేందుకు అన్ని విధాలుగా సిద్ధమవుతున్నట్లు ప్రచారం ఊపందుకుంది.
Also Read : వైసీపీని ముందుకు నడిపించేదెవరు..?
అటు కేంద్ర ప్రభుత్వం కూడా ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి సహాయ సహకారాలు అందించే సంకేతాలు కూడా కనపడుతున్నాయి. జగన్ మాజీ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డిని, అలాగే ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డిని అదుపులోకి తీసుకున్న తర్వాత పరిణామాలు ఆసక్తిని రేపుతున్నాయి. వాళ్ళిద్దరూ దర్యాప్తు అధికారులకు ఏమాత్రం సహకరించకపోయినా.. వాళ్ళిద్దరికి సంబంధించిన సాక్షాలను దర్యాప్తు అధికారులు పక్కాగా సేకరించారు. భారతి వ్యాపార వ్యవహారాలు చూసే బాలాజీ గోవిందప్ప ఇంట్లో స్వాధీనం చేసుకున్న కొన్ని పత్రాలు లో జగన్మోహన్ రెడ్డి పాత్ర స్పష్టంగా ఉన్నట్లు గుర్తించినట్లు తెలుస్తోంది.
Also Read : వైసీపీ – టీడీపీ మధ్య ప్యాలెస్ వార్..!
అరెస్టు ఎప్పుడు జరుగుతుంది అనే దానిపై స్పష్టత లేకపోయినా రాబోయే నెల రోజుల్లో మాత్రం కీలక పరిణామాలు చోటు చేసుకునే సంకేతాలు స్పష్టంగా ఉన్నాయి. ఇటీవల ఏపీ మంత్రి నారా లోకేష్ ఢిల్లీ పర్యటనకు వెళ్లిన తర్వాత ఈ ఆసక్తికర అంశం బయటకు వచ్చింది. అప్పటినుంచి జగన్మోహన్ రెడ్డిని అరెస్టు చేయవచ్చు అనే ప్రచారం గట్టిగా జరుగుతోంది. కేంద్ర పెద్దలకు లోకేష్.. లిక్కర్ స్కాం కు సంబంధించిన ఆధారాలను అందించినట్లు మరో వార్త ఆసక్తిని రేపుతోంది. త్వరలోనే ఈ కేసుని జాతీయ దర్యాప్తు బృందాలు టేకప్ చేసే అవకాశం ఉండవచ్చంటున్నాయి రాజకీయ వర్గాలు.