ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు కూటమి సర్కార్ పై సానుకూలత ఎంత ఉందో.. వ్యతిరేకత కూడా అదే రేంజ్ లో ఉందనే వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా ఇసుక, మద్యం విషయంలో ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చిందనే ఆరోపణలు ఉన్నాయి. ఇదే సమయంలో కార్యకర్తల్లో కూడా ప్రభుత్వంపై ఆగ్రహం ఉందనే ప్రచారం జరుగుతోంది. సోషల్ మీడియాలో దీనిపై పెద్ద ఎత్తున కామెంట్స్ ఉన్నాయి. ప్రభుత్వంపై చాలా అంచనాలు ఉన్నాయని, వాటిని అందుకోవడం లేదనే ఆరోపణలు ఎక్కువగా వచ్చాయి. దీనితో చంద్రబాబు కూడా రియాక్ట్ అయ్యారు.
తనను కూడా వేధించారు అని.. కాని తాను ఏది మనసులో పెట్టుకోను అని.. కానీ చట్ట ప్రకారం శిక్షలు ఉంటాయి అంటూ చెప్పుకొచ్చారు. దీనిపై కార్యకర్తల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. కార్యకర్తల్లో ఆగ్రహాన్ని గ్రహించిన లోకేష్ కీలక అడుగులు వేస్తున్నారు. సంక్రాంతి తర్వాతి నుంచి సిక్కోలు నుంచి చిత్తూరు వరకు కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించాలని భావిస్తున్నారు. దీనికి సంబంధించి రూట్ మ్యాప్ కూడా సిద్దం చేస్తున్నారు. కార్యకర్తల అభిప్రాయాలను తెలుసుకోవడంతో పాటుగా వారి కోసం ఓ కీలక కార్యక్రమాన్ని కూడా పార్టీ తీసుకు రానుంది.
Also Read : షర్మిలతో రాజీ.. రంగంలోకి సూరీడు..!
దీనికి సంబంధించి త్వరలోనే కార్యాచారణ ప్రకటించే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయి. వైసీపీ ఇప్పుడు కొన్ని ఆరోపణలను వేగవంతం చేసింది. అటు సోషల్ మీడియాలో కూడా గట్టిగానే టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తోంది. వీటి విషయంలో టీడీపీ కార్యకర్తలు సైలెంట్ గానే ఉంటున్నారు. అందుకే ఇప్పుడు వాటికి కౌంటర్ లు ఇచ్చే విధంగా కూడా ఓ టీంని రెడీ చేయాలని లోకేష్ భావిస్తున్నారు. కార్యకర్తల్లో ఉండకపోతే సమస్యలు వచ్చే అవకాశం ఉందని కూడా పరిశీలకులు లోకేష్ ను హెచ్చరిస్తున్న సంగతి తెలిసిందే. దీనితో కార్యకర్తల్లోకి వెళ్లేందుకు సిద్దమవుతున్నారు.




