2019 నుంచి 2024 వరకు ఏపీలో వైసీపీ సర్కార్ అనుసరించిన వైఖరి కారణంగా.. ప్రస్తుత కూటమి పార్టీల కార్యకర్తల్లో తీవ్ర ఆగ్రహాలు ఉన్న మాట వాస్తవం. పదే పదే అప్పట్లో అరెస్ట్ లు చేయడం, వేధించడం వంటి చర్యలకు వైసీపీ సర్కార్ దిగిన మాట వాస్తవం. ఇక జగన్ కూడా ముఖ్యమంత్రి హోదాలో రెచ్చగొట్టే విధంగానే ప్రసంగాలు చేసిన సందర్భాలు ఉన్నాయి. రాజకీయంగా ఇదే వైసీపీకి పెద్ద సమస్యగా మారిన మాట కూడా వాస్తవమే. అప్పుడు జగన్ వైఖరితో టీడీపీ కార్యకర్తలు కూడా అదే మాదిరిగా అరెస్ట్ లు చేయాలని డిమాండ్ చేస్తూ వచ్చారు.
Also Read : ఆ అహంకారమే.. ఈ పరిస్థితికి కారణం..!
నారా లోకేష్ రెడ్ బుక్ విషయంలో స్లోగా ఉన్నారనే విమర్శలు సైతం టీడీపీ క్యాడర్ చేసిన మాట వాస్తవం. అయితే రెడ్ బుక్ లో ఉన్న ఒక్కొక్కరికి చుక్కలు చూపిస్తూ వస్తోంది కూటమి సర్కార్. ఈ విషయం టీడీపీ క్యాడర్ కు కాస్త ఆలస్యంగా అర్ధమైంది అనేది చాలా మందిలో ఉన్న అభిప్రాయం. అదంతా ఒక ఎత్తు అయితే.. ఇటీవల సాక్షి ఛానల్ లో ఆ ఛానల్ జర్నలిస్ట్ ఒకరు అమరావతి మహిళల విషయంలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేసారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాలతో పాటుగా సామాన్య ప్రజల్లో సైతం ఆగ్రహానికి కారణం అయ్యాయి.
Also Read : చంద్రబాబు తరఫున జగన్ ప్రచారం..!
వ్యాఖ్యలు చేసిన రెండు మూడు రోజుల తర్వాత ముందు జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావును అరెస్ట్ చేయగా.. బుధవారం వ్యాఖ్యలు చేసిన.. కృష్ణం రాజును అరెస్ట్ చేసారు. దీనిపై లోకేష్ ఓ సభలో మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్ చేసారు. వారిని విమర్శిస్తూనే.. వెంటనే అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదని.. ఆ వ్యాఖ్యలు ప్రజల్లోకి వెళ్లాలని, ప్రజలకు వారి మనస్తత్వం అర్ధం కావాలని, ఎందుకు అరెస్ట్ చేసారో ప్రజలకు అర్ధం అయ్యే వరకు వేచి చూడాలని వ్యాఖ్యానించారు లోకేష్. సాక్షిలో వ్యాఖ్యల విషయంలో ప్రభుత్వం చేసింది కరెక్టే అనే అభిప్రాయం వినపడింది. దీనిపై పెద్ద ఎత్తున సామాన్య ప్రజల్లో నిరసన వ్యక్తం కావడం, మహిళలు రోడ్ల మీదకు రావడం జరిగాయి. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.