Monday, October 27, 2025 10:44 PM
Monday, October 27, 2025 10:44 PM
roots

ఏపీకి బాహుబలి ప్రాజెక్ట్

ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడుల విషయంలో కేంద్ర ప్రభుత్వం దూకుడుగా వ్యవహరిస్తోంది. మౌలిక సదుపాయాల కల్పనపై ఎక్కువగా మోడీ సర్కార్ ఫోకస్ చేసింది. అమరావతి నిర్మాణానికి అన్ని విధాలుగా సహకరిస్తున్న కేంద్రం.. కేంద్ర ప్రభుత్వ సంస్థలపై ఫోకస్ చేసింది. గత అయిదేళ్లుగా చాలా ప్రాజెక్ట్ ల విషయంలో శంకుస్థాపనలే మినహా ప్రారంభాలు ఎక్కడా జరగలేదు. ఇప్పుడు నిర్మాణాలను పూర్తి చేయాలని కేంద్రం టార్గెట్ పెట్టుకుని.. గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేసింది. తాజాగా ఏపీకి మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ తీసుకొస్తోంది కేంద్రం.

Also Read : స్కాంలో లేము.. కేసిరెడ్డి టు కృష్ణమోహన్ రెడ్డి.. ఎవరిని ఇరికిస్తున్నట్టు..?

ఆంధ్రప్రదేశ్‍కు మరో కీలక బహుబలి ప్రాజెక్టు వస్తోంది. దుగ్గరాజపట్నంలో.. భారీ నౌకా నిర్మాణం, మరమ్మతు కేంద్రం ఏర్పాటు చేస్తోంది. ప్రాజెక్టుకు సుమారు రూ.3 వేల కోట్లు అవుతుందని అంచనా వేస్తోంది. ఇవాళ ఏపీకి కేంద్ర నౌకాయాన, జల రవాణా శాఖ మంత్రి బృందం వచ్చి.. సీఎం చంద్రబాబుతో భారీ నౌకా నిర్మాణ కేంద్రంపై చర్చించనుంది. ఏపీతో పాటు గుజరాత్, తమిళనాడులో ఓడల తయారీ సెంటర్లను ఏర్పాటు చేయనుంది కేంద్ర సర్కార్. దీనిపై ఇప్పటికే రూట్ మ్యాప్ కూడా రెడీ చేసింది.

Also Read : వంశీ చార్జ్ షీట్ లో సంచలన విషయాలు

విదేశీ సంస్థలతో కపిపి షిప్ బిల్డింగ్ అండ్ రిపేర్ సెంటర్ల ఏర్పాటు చేస్తోంది. మూడు రాష్ట్రాల్లో స్థలాలను ఎంపిక చేసిన కేంద్రం… రాష్ట్ర ప్రభుత్వాలతో కూడా సంప్రదింపులు పూర్తి చేసింది. షిప్ బిల్డింగ్ అండ్ రిపేర్ సెంటర్ల కోసం షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఇతర విదేశీ సంస్థల మధ్య చర్యలు, సంప్రదింపులు కొనసాగుతున్నాయి. భూ కేటాయింపులతో పాటుగా పలు కీలక అంశాలను సిఎం తో చర్చించనుంది కేంద్ర ప్రభుత్వ బృందం. దీనితో భారీగా ఉపాధి కల్పనకు శ్రీకారం చుట్టనుంది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.....

తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక...

ఐసీయూలో శ్రేయస్ అయ్యర్.....

సౌత్ ఆఫ్రికా తో కీలక వన్డే...

చావులోను ఆగని విష...

సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మానవత్వంతో...

గట్టిగానే సంక్రాంతి పోటీ.....

సంక్రాంతి పండుగ.. తెలుగు వారికి అతి...

బ్రేకింగ్: పరకామణి కేసులో...

గత కొన్నాళ్లుగా తిరుమలలో పరకామణి వ్యవహారం...

కొత్త జిల్లాలు.. మారనున్న...

ఏపీలో జిల్లాల పునర్‌ విభజన ప్రక్రియ...

పోల్స్