Tuesday, October 28, 2025 02:26 AM
Tuesday, October 28, 2025 02:26 AM
roots

అక్కడ ఏం జరుగుతోంది..?

పార్టీలో ఏం జరుగుతోంది..? అసలు పార్టీ అధినేత ఉన్నారా.. లేరా..? ఇదే తెలంగాణలో హాట్ టాపిక్. ఈ చర్చ అంతా భారత రాష్ట్ర సమితి గురించే. వరుసగా రెండుసార్లు అధికారంలో ఉన్న పార్టీలో ఇప్పుడు అంతర్గత కలహాలు తారాస్థాయికి చేరుకున్నాయనేది బహిరంగ రహస్యం. గులాబీ పార్టీ రథసారధి ఎవరనే చర్చ కూడా జోరుగా నడుస్తోంది. పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత కుటుంబంలోనే ఇప్పుడు ఆధిపత్య పోరు నడుస్తోంది. సొంత అన్నా చెల్లెళ్ల మధ్య నువ్వా నేనా అన్నట్లుగా నడుస్తున్న వార్… నెక్స్ట్ లెవల్‌కు చేరుకుంది.

Also Read : యువతకు మోడీ గుడ్ న్యూస్.. వాళ్లకు రూ. 15000

తెలంగాణలో కారు పార్టీ జోరుకు పూర్తిగా బ్రేకులు పడ్డాయి. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత గులాబీ పార్టీకీ కష్టాలు మొదలయ్యాయి. కారు పార్టీ ఓటమికి ప్రధానంగా పేరు మార్పు అనేది విశ్లేషకుల మాట. తెలంగాణ సెంటిమెంట్ అడ్డుపెట్టుకుని గెలిచిన పార్టీ పేరులో.. తెలంగాణ తొలగించడం ప్రజలకు రుచించలేదు. ఇక పదేళ్ల కేసీఆర్ పాలనపై విమర్శలు కూడా ఉన్నాయి. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం.. అవినీతి, పార్టీలో అంతర్గత కలహాలు, నేతల మధ్య పోరు.. బీఆర్ఎస్ ఓటమికి కారణాలు.

ఇక కవిత అరెస్టు తర్వాత పార్టీలో పరిణామాలు మారిపోయాయి. 5 నెలలు జైలు జీవితం గడిపిన తర్వాత బెయిల్‌పై బయటకు వచ్చిన కవిత.. ఇప్పుడు సొంత అన్న కేటీఆర్‌పైనే తిరుగుబావుటా ఎగురవేశారు. చివరికి పార్టీ విలీనం చేసేందుకు కూడా వెనుకాడటం లేదని సంచలన ఆరోపణలు చేశారు. దీనిపై అధినేత కూడా ఎలాంటి ఖండన చేయలేదు. అలాగే పార్టీలో మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డిని కవిత టార్గెట్ చేశారు. దీంతో ప్రస్తుతం బీఆర్ఎస్‌లో కేటీఆర్, కవిత గ్రూపుల మధ్య నువ్వా నేనా అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది.

Also Read : ఆ పార్టీ భవిష్యత్తు తేల్చేసిన ఉండవల్లి..!

ఇదే సమయంలో కేసీఆర్ అరెస్టు అంటూ వస్తున్న పుకార్లపై సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా స్పందించారు. ప్రస్తుతం కేసీఆర్ జైలులాంటి ఫామ్ హౌజ్‌లో ఉన్నారని.. ఇంటి పోరు వల్ల బయట తిరగలేక పోతున్నారని.. ఇంతకంటే పెద్ద శిక్ష ఏముందని సెటైర్లు వేశారు. తాజాగా కవిత అమెరికా వెళ్తూ.. కనీసం సొంత అన్న కేటీఆర్‌ను కలవలేదు. కేసీఆర్‌తో భేటీ అయ్యారు తప్ప.. అన్న గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. దీంతో అసలు బీఆర్ఎస్‌లో ఏం జరుగుతోంది.. అనే చర్చ జోరుగా జరుగుతోంది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.....

తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక...

ఐసీయూలో శ్రేయస్ అయ్యర్.....

సౌత్ ఆఫ్రికా తో కీలక వన్డే...

చావులోను ఆగని విష...

సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మానవత్వంతో...

గట్టిగానే సంక్రాంతి పోటీ.....

సంక్రాంతి పండుగ.. తెలుగు వారికి అతి...

బ్రేకింగ్: పరకామణి కేసులో...

గత కొన్నాళ్లుగా తిరుమలలో పరకామణి వ్యవహారం...

కొత్త జిల్లాలు.. మారనున్న...

ఏపీలో జిల్లాల పునర్‌ విభజన ప్రక్రియ...

పోల్స్