Tuesday, October 28, 2025 05:07 AM
Tuesday, October 28, 2025 05:07 AM
roots

టిడ్కో ఇళ్ళ వెనుక విధ్వంసం బయటపెట్టిన మంత్రి…!

గత 5 ఏళ్ళుగా టిడ్కో ఇళ్ళను రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందనే అభిప్రాయం మాత్రమే ప్రజల్లో ఉంది, కాని టిడ్కో ఇళ్ళ వెనుక సొంత కాళ్ళపై నిలబడే ఒక బలమైన వ్యవస్థను కూడా గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిందనే వాస్తవాలను ప్రజలు తెలుసుకోవాలని ఏపీ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సంచలన విషయాలు బయటపెట్టారు. బుధవారం విజయవాడ రూరల్ జక్కంపూడిలో 2018 లో నిర్మాణం చేపట్టిన “ఫ్లాటేడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్”ను మంత్రి పరిశీలించి, నిర్మాణ పనులను చేపట్టిన సంస్థ ప్రతినిధులు, అధికారులతో మంత్రి రివ్యూ నిర్వహించారు.

Also Read : పెద్దిరెడ్డిపై పవన్ కళ్యాణ్ గురి

జరిగిన విధ్వంసాన్ని చూసిన మంత్రి చలించిపోయారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుపేదలు, దిగువ మధ్య తరగతి వారి భవిష్యత్తుకు బలమైన పునాదులను గత వైకాపా ప్రభుత్వం ఏ విధంగా కూల్చారన్నది ప్రజలకు స్వయంగా తెలియజేయాల్సిన అవసరం ఉందనిఅన్నారు. ఈ కాంప్లెక్స్ ద్వారా టిడ్కో ఇళ్ళలో నివాసం ఉండే ప్రజలకు స్వయం ఉపాధి కల్పించడం ప్రధాన ఉద్దేశంగా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఈ కాంప్లెక్స్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది.

కొద్ది కాలంలో ఒక భారీ ఫ్లాటేడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ నిర్మాణాన్ని ప్రారంభించి దాదాపు పూర్తి చేశారు. అన్ని సదుపాయాలను కేవలం 3 నెలల్లో కల్పించి, మరో 4 నెలల్లో అందుబాటులోకి తీసుకురావచ్చని ఆయన తెలిపారు. ఆసమయంలో జరిగిన సాధారణ ఎన్నికల్లో అప్పటి ప్రభుత్వం అధికారాన్ని కోల్పోయి రాష్ట్రంలో వైకాపా పాలన ప్రారంభమైంది. చిన్న మధ్య తరహా కంపెనీలకు ఓ బలమైన వేదిక కావల్సిన ప్రభుత్వ నిర్లక్ష్యానికి గురి అయింది. ఈ కాంప్లెక్స్ చిన్న చిన్న వస్తువులను తయారు చేయడానికి, ఉదాహరణకు పాదరక్షలు, వ్యవసాయ ఆహార ఉత్పత్తి, ప్యాకింగ్ సామగ్రి తదితర చిన్న చిన్న కంపెనీలకు అన్ని రకాల మౌళిక వసతులు ఉండేలా ఈ కాంప్లెక్స్ నిర్మాణానికి రూపకల్పన జరిగినా ఆ లక్ష్యం నెరవేరలేదు.

Also Read :రాజమౌళికి కేరళ యాక్టర్ షాక్…?

టిడ్కో ఇళ్ళలో నివాసం ఉండేవారికి ఉపాధి కల్పించే కార్యక్రమానికి ప్రభుత్వం పాతరేసింది . విద్వంసం నుంచి అభివృద్ధి దిశగా సాగుతున్న నేటి ప్రభుత్వం వారికి నైపుణ్యం పెంచే విధంగా ఇక్కడ అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించడం జరుగుతోంది. ఉద్యోగాలు, ఉపాధి కొరకు ఎక్కడికో టిడ్కో ఇళ్ళలో నివాసం ఉండే పేదలు, వారి వారసులు వేరే ప్రాంతాలకు వెళ్ళే అవసరం లేకుండా ఈ కాంప్లెక్స్ ద్వారా ఉపాధి కల్పించే అవకాశం లభిస్తుంది. చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం మళ్ళీ ఫ్లాటేడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ కు ప్రాణం పోసి, టిడ్కో ఇళ్ళు అనేవి కేవలం నివాస సముదాయాలే కాదు, భవిష్యత్తుకు భరోసా కల్పించే సౌధాలుగా మార్చుతామని అన్నారు. గత 5 ఏళ్ళుగా జరిగిన విధ్వంసంలో ప్రజలు కోల్పోయిన భవిష్యత్తుకు ప్రత్యక్ష సాక్షి మారిన జక్కంపూడి ఫ్లాటేడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ ను ఉత్పత్తి, ఉపాధి కేంద్రంగా మారుస్తామని మంత్రి శ్రీనివాస్ తెలియజేశారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.....

తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక...

ఐసీయూలో శ్రేయస్ అయ్యర్.....

సౌత్ ఆఫ్రికా తో కీలక వన్డే...

చావులోను ఆగని విష...

సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మానవత్వంతో...

గట్టిగానే సంక్రాంతి పోటీ.....

సంక్రాంతి పండుగ.. తెలుగు వారికి అతి...

బ్రేకింగ్: పరకామణి కేసులో...

గత కొన్నాళ్లుగా తిరుమలలో పరకామణి వ్యవహారం...

కొత్త జిల్లాలు.. మారనున్న...

ఏపీలో జిల్లాల పునర్‌ విభజన ప్రక్రియ...

పోల్స్