Friday, September 12, 2025 10:57 PM
Friday, September 12, 2025 10:57 PM
roots

పిలుపు దూరంలో మంత్రి.. ఏపీ కేబినేట్ లో ఇంట్రస్టింగ్ క్యారెక్టర్..!

ఒకప్పటి రాజకీయాలకు ఇప్పటి రాజకీయాలకు చాలా తేడా ఉంటుంది మనం గమనిస్తే. ఒకప్పుడు చాలా మంది నాయకులు ఎన్నికల టైం లో హడావుడి చేసి ఆ తర్వాత పెద్దగా కనపడేవారు కాదు. ఓట్ల కోసం ప్రజలకు ఆ నాలుగు రోజులు అందుబాటులో ఉండటం, వినతీ పత్రాలు తీసుకోవడం.. గెలిస్తే వ్యాపారాలు చక్కబెట్టుకోవడం. కాని ఇప్పుడు మాత్రం రాజకీయాల్లో ప్రజలకు దగ్గరగా ఉన్నవాడే నాయకుడు. ఈ సూత్రాన్ని పక్కాగా ఫాలో అవుతున్నారు ఏపీ మంత్రి కొండపల్లి శ్రీనివాస్. తాను ఎక్కడున్నా.. ఏం చేస్తున్నా సరే ప్రజలకు మాత్రం పిలుపు దూరంలో ఉంటున్నారు.

మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వారంలో రెండు రోజులు నియోజకవర్గానికి కేటాయించిన మంత్రి.. తాను ఎక్కడున్నా సరే నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటా అనే సిగ్నల్ ఇచ్చేసారు. మిగిలిన రోజులు ఎక్కువగా సచివాలయంలోనే ఉంటున్నారు. తన శాఖలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకోవడం, ప్రభుత్వ పెద్దల ఆదేశాలు అమలు చేయడం.. తన శాఖలో క్షేత్ర స్థాయి పరిస్థితులు తెలుసుకోవడం.. సచివాలయంలో ఎవరైనా తనను వచ్చి కలవచ్చు అనే విధంగా ఒక ప్లాన్ ప్రకారం వెళ్తున్నారు.

Also Read : డయాఫ్రం వాల్ నిర్మాణం, రంగంలోకి విదేశీ నిపుణులు…!

మంత్రులు అందుబాటులో ఉండరు అనే నానుడికి ఈయన ఫుల్ స్టాప్ పెట్టేసారు. సచివాలయంలో ఎవరైనా నన్ను కలవచ్చని.. లేదంటే నా క్యాంప్ ఆఫీస్ లో అందుబాటులో ఉంటా అంటూ క్లారిటీగా చెప్పేశారు. ఇక మంత్రి గారి చుట్టూ కోటరీ కూడా లేకపోవడం ఆశ్చర్యకరమైన విషయం. చాలా మంది మంత్రులు ఈ మధ్య కాలంలో కోటరీ ఏర్పాటు చేసుకుని.. తమను కలవాలి అంటే ఆ వలయం బ్రేక్ చేయాల్సిందే అనే సిగ్నల్స్ ఇస్తున్నారు. ఈ పద్ధతికి కూడా మంత్రిగారు ఎండ్ కార్డ్ చూపించారు.

తాను ఎక్కడికి అయినా పర్యటనకు వెళ్తే వ్యక్తిగత సిబ్బందిని కూడా దూరంగానే ఉంచుతున్నారు మంత్రి. విజయవాడలో కూడా తన క్యాంప్ ఆఫీస్ వద్ద.. తన నియోజకవర్గ నేతల హడావుడి లేకుండా జాగ్రత్త పడ్డారు. ఇక ఫోన్ లో, వాట్సాప్ లో నిత్యం అందుబాటులో ఉండటం, ఏదైనా కార్యక్రమం ఉంటే నియోజకవర్గానికి వెళ్లి వెంటనే తిరిగి రావడం చేస్తున్నారు. నియోజకవర్గంలో ముందు కొండపల్లి శ్రీనివాస్ ను వ్యతిరేకించిన వాళ్ళు కూడా ఇప్పుడు సైలెంట్ అయిపోయారు. తనపై ఉన్న అభిప్రాయాలను మార్చడంలో మంత్రి సక్సెస్ అయ్యారు.

Also Read : విచారణ తరువాత స్వరం మార్చిన కేటిఆర్

గెస్ట్ హౌస్ లు, ఫాం హౌస్ ల సంస్కృతికి కూడా మంత్రి దూరంగా ఉండటం గమనార్హం. ఉంటే క్యాంప్ ఆఫీస్.. లేదంటే సచివాలయం అన్నట్టే ఉంది మంత్రి శైలి. ఇక తనపై ఏవైనా ఆరోపణలు వస్తే.. వాటిపై అనవసరంగా వ్యాఖ్యలు చేయకపోవడం, ఆవేశపూరిత వ్యాఖ్యలకు దూరంగా ఉండటం గమనార్హం. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో మంత్రిపై కాస్త రచ్చ జరిగింది. ఈ రచ్చ విషయంలో కూడా ఈయన పెద్దగా రియాక్ట్ కాలేదు. ప్రభుత్వ పెద్దలకు తానేంటి అనేది క్లారిటీ ఉన్నప్పుడు.. అనవసర వివరణలు ఎందుకు అనుకున్నారో ఏమో గాని పెద్దగా మాట్లాడే ప్రయత్నం చేయలేదు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్