Friday, September 12, 2025 05:09 PM
Friday, September 12, 2025 05:09 PM
roots

ప్రభుత్వంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే సెన్సేషనల్ కామెంట్స్

తెలంగాణలో సంక్షేమ కార్యక్రమాల అమలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని విపక్షాలు టార్గెట్ చేస్తూనే ఉన్నాయి. ప్రధానంగా రైతు బంధు విషయంలో తీవ్ర విమర్శలు వచ్చాయి. రైతుబంధుని అలాగే రైతు రుణమాఫీని రాష్ట్ర ప్రభుత్వం కొంతమందికి ఎగ్గొట్టిందని విపక్షాలు తీవ్రస్థాయిలో ఆరోపణలు చేయడం చూసాం. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీటి విషయంలో ఘాటుగానే కౌంటర్ ఇస్తున్నా ప్రజల్లోకి మాత్రం ఇప్పటికే వెళ్లాల్సిన సంకేతాలు వెళ్లిపోయాయి.

Also Read: తెలంగాణాలో బిజేపి ఊహించని సీన్

ఆరు గ్యారెంటీ ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగా లేకపోవడం వచ్చిన ఆరోపణలను తిప్పికొట్టే విషయంలో సమర్థవంతంగా లేకపోవడంతో ప్రజల్లోకి వెళ్లే సంకేతాలు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరుకున పడేస్తున్నాయి. ఇక తాజాగా పథకాలపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గ్రామాల్లో ప్రజలు ప్రభుత్వాన్ని తిడుతున్నారని ఆయన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ను మెచ్చుకుంటున్నారని రైతుబంధు మధ్యలో ఒకసారి ఎగ్గొట్టినమంటూ ఆయన ఆరోపణలు చేశారు.

Also Read: గవర్నర్ ఫోన్ ట్యాపింగ్.. కీలక సాక్ష్యాలు లభ్యం..!

ఇక రైతురుణ మాఫీలో కూడా ఇచ్చిన హామీ మేర కాకుండా కొంత నగదును తగ్గించామని అందుకే గ్రామ ప్రజలు ప్రభుత్వాన్ని తిడుతున్నారన్నారు. ఎన్ని అప్పులు చేసిన పథకాలను అమలు చేస్తామని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈ సందర్భంగా స్పష్టం చేశారు. కాగా ఇటీవల రైతు బంధు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చాలా జాగ్రత్తగా వ్యవహరించింది. గత ప్రభుత్వంలో భూమి లేని వాళ్లకు అలాగే బీడు భూములకు కూడా రైతుబంధు అమలు చేశారని ఆరోపణలు వినిపించాయి. ఇటీవల 3 లక్షల ఎకరాలకు అక్రమంగా రైతు బంధు ఇచ్చినట్టు గుర్తించారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

హైదరాబాద్ నుంచి వైసీపీ...

వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే ఫోకస్ పెడుతున్న...

ఇదేం ప్రెస్ మీట్...

రాజకీయ నాయకులు మీడియా సమావేశాలు నిర్వహించడం,...

లోకేష్ అదుర్స్.. వార్...

నేపాల్ పరిస్థితుల నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...

తమిళనాడు పై పవన్...

తమిళనాడు ఎన్నికలను భారతీయ జనతా పార్టీ...

పోల్స్