Tuesday, October 28, 2025 04:23 AM
Tuesday, October 28, 2025 04:23 AM
roots

కోహ్లీ.. కార్తిక్ మధ్య ఏం జరిగింది..?

గురువారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా, విరాట్ కోహ్లీ, దినేష్ కార్తీక్ మధ్య జరిగిన ఓ సంభాషణ ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ ఫుటేజ్‌లో కార్తీక్, ప్రధాన కోచ్ ఆండీ ఫ్లవర్.. విరాట్ కోహ్లీ ఫీల్డింగ్ చేసే టైం లో.. ఓ సలహా ఇవ్వగా దాన్ని కోహ్లీ.. తోసిపుచ్చినట్లు తెలుస్తోంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో వరుసగా మూడు మ్యాచ్ లు ఓడిపోయిన ఆర్సీబీ.. ఈ మ్యాచ్ లో ఉత్కంట భరిత విజయాన్ని అందుకుంది.

Also Read : ఎవరు ఓడినా ఇంటికే.. ఐపీఎల్ లో కీలక మ్యాచ్

ఈ మ్యాచ్ లో ఆర్సీబీ విజయంలో కోహ్లీ కీలక పాత్ర పోషించాడు. 70 పరుగులతో రాణించడంతో 20 ఓవర్లలో 205 పరుగులు చేసింది. పడిక్కల్ కూడా అర్ధ సెంచరీతో రాణించడంతో భారీ స్కోర్ చేసింది. ఇక ఆ జట్టు బౌలర్లు ముందు తడబడినా.. ఆ తర్వాత పట్టు బిగించారు. దీనితో కీలక సమయంలో రాజస్థాన్ వికెట్లు కోల్పోయింది. చివర్లో జోష్ హాజిల్‌వుడ్ అద్భుతమైన బౌలింగ్ తో రాణించడంతో ఆర్సీబీ అద్భుతమైన విజయాన్ని అందుకుంది. రాజస్థాన్ కూడా చివర్లో తడబడటంతో.. వరుసగా వికెట్లు కోల్పోయింది.

Also Read : రాహుల్ కు బోర్డు బంపర్ ఆఫర్..?

అయితే ఇప్పుడు వీళ్ళ ఇద్దరి మధ్య ఏం జరిగింది అనేది ఆసక్తికరంగా మారింది. కీలక సమయంలో కెప్టెన్ గా బాధ్యతలు తీసుకోవాలని, రజత్ పాటిదార్ ను ముందు ఉండి నడిపించాలని కార్తిక్ చెప్పగా.. అందుకు కోహ్లీ నిరాకరించాడని కొందరు కామెంట్ చేస్తున్నారు. గత సీజన్ల కంటే ఈ సీజన్ లో ఆర్సీబీ దూకుడుగా ఆడుతోంది. మరో రెండు విజయాలు సాధిస్తే ఆ జట్టు ప్లే ఆఫ్స్ కు చేరుకున్నట్టే. ఇక రన్ రేట్ పరంగా కూడా ఆ జట్టుకు ఇబ్బంది లేదు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.....

తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక...

ఐసీయూలో శ్రేయస్ అయ్యర్.....

సౌత్ ఆఫ్రికా తో కీలక వన్డే...

చావులోను ఆగని విష...

సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మానవత్వంతో...

గట్టిగానే సంక్రాంతి పోటీ.....

సంక్రాంతి పండుగ.. తెలుగు వారికి అతి...

బ్రేకింగ్: పరకామణి కేసులో...

గత కొన్నాళ్లుగా తిరుమలలో పరకామణి వ్యవహారం...

కొత్త జిల్లాలు.. మారనున్న...

ఏపీలో జిల్లాల పునర్‌ విభజన ప్రక్రియ...

పోల్స్