Friday, September 12, 2025 07:06 PM
Friday, September 12, 2025 07:06 PM
roots

రెడ్ బుక్ లో పేరున్నా.. కీలక పోస్టింగ్! సీఐ గారి హవా..!

ఆంధ్రప్రదేశ్ లో గత ఐదేళ్లుగా వైసీపీ నేతలను చూసుకుని చెలరేగిపోయిన అధికారులకు కూటమి ప్రభుత్వం చుక్కలు చూపిస్తుందని చాలామంది ఆశపడ్డారు. ముఖ్యంగా నారా లోకేష్ రాసుకున్న రెడ్ బుక్ లో ఎందరో అవినీతి, అక్రమాలు చేసిన అధికారుల పేర్లు ఉన్నాయని వార్తలు వచ్చాయి. ఖచ్చితంగా వాళ్లందరూ జైలుకు వెళ్లడం ఖాయమని వాళ్లకు పోస్టింగ్ రావడం కూడా కష్టమని మీడియాలో కూడా హడావుడి జరిగింది. కానీ.. తీరా చూస్తే ఆ అధికారులు వైసీపీ ప్రభుత్వంలో కంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడే చాలా కంఫర్టబుల్ జోన్ లో ఉన్నారు అనే అభిప్రాయం కార్యకర్తల నుంచి వినపడుతోంది.

Also Read: చిరంజీవి కి రాజ్యసభ ఆఫర్.. ఢిల్లీలో డీల్ ఫైనల్

ఎవరిని ఎన్ని విధాలుగా వేధించినా సరే, అధికారులకు మాత్రం పోస్టింగులు.. అలాగే ప్రమోషన్లు కూడా దక్కే పరిస్థితి ఉంది. తాజాగా ఓ సిఐ గారికి కీలక పోస్టింగ్ ఇచ్చారు పోలీసు ఉన్నతాధికారులు. ఇటీవల బాపట్ల టౌన్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ గా బాధ్యతలు చేపట్టిన సీఐ రాజుపాలెం రాంబాబు వ్యవహారం తీవ్ర దుమారమే రేపుతోంది. ఒంగోలు రూరల్ సర్కిల్ ఆఫీస్ లో విధులు నిర్వహిస్తున్న సమయంలో 2021 నవంబర్ 11న ప్రకాశం జిల్లా చదలవాడ వద్ద పాదయాత్ర చేస్తున్న రాజధాని రైతులపై ఆ అధికారి విచక్షణ రహితంగా విరుచుకుపడి తాను పోలీస్ అనే విషయాన్ని మర్చిపోయి రైతుల పై దాడి చేశారు. ఈ ఘటనలో పలువురు రైతులకు తీవ్ర గాయాలు అయ్యాయి. అలాగే ప్రజలతో కూడా దురుసుగా ప్రవర్తించేవారు అనే ఆరోపణలు ఉన్నాయి.

Also Read: కూటమి సర్కార్‌లో ఇబ్బందు వస్తున్నాయా..?

గతంలో చీరాల పోలీస్ డివిజన్ పరిధిలో సబ్ ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వహించిన సమయంలో ఇసుక అక్రమ రవాణాకు కూడా ఆయన సహకరించారు అనే ఆరోపణలు సైతం స్థానికుల వినిపించాయి. 2019 ఇంకొల్లు సీఐగా విధులు నిర్వహించే సమయంలో ఒక జర్నలిస్టు మీద చిన్నగంజాం వద్ద జరిగిన హత్యా ప్రయత్నం ఘటనపై నమోదైన కేసులో కుట్ర దారులతో.. అలాగే ప్రధాన నిందితులతో కొమ్మకై కేసును నీరుగార్చారు ఆరోపణలు సైతం వినిపించాయి. ఇన్ని ఆరోపణలు ఉన్న వివాదాస్పద అధికారిని మళ్లీ కీలక పోస్టింగులో కూర్చోబెట్టిన ఉన్నతాధికారులు ఎవరు..? ఎవరి ప్రమేయం ఇక్కడ పనిచేసింది అనేది ఆసక్తికరంగా మారింది. దీనిపై టిడిపి నేతలు కార్యకర్తలు సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు. ఎన్నికల సమయంలో దాడులకు గురైన అధికారులకు ఇవ్వని ప్రాధాన్యత అవినీతి అధికారులకు ఇవ్వడం కరెక్ట్ కాదని మండిపడుతున్నారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

హైదరాబాద్ నుంచి వైసీపీ...

వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే ఫోకస్ పెడుతున్న...

పోల్స్