Monday, October 27, 2025 02:57 AM
Monday, October 27, 2025 02:57 AM
roots

మదనపల్లి ఆర్డీవో ఆఫీసు దహనం కేసులో కీలక మలుపు

రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం అయిన… మదనపల్లి ఆర్డీవో ఆఫీసు దహనం కేసు వ్యవహారం ఇప్పుడు సైలెంట్ అయిందా…? అంటే అవుననే సమాధానం వినపడుతోంది. ఈ కేసుకి సంబంధించి కీలక అరెస్ట్ లు ఉంటాయని ముందు నుంచి వార్తలు వస్తూనే ఉన్నాయి. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డిని అరెస్ట్ కూడా చేయవచ్చనే ప్రచారం గట్టిగానే సాగింది. దీనిపై ఇంకా స్పష్టత రాలేదు. అసలు ప్రమాదం ఎలా జరిగింది ఏంటీ అనే దానిపై ఇప్పటికే విచారణ దాదాపుగా ఒక కొలిక్కి వచ్చింది.

స్వయంగా ఈ కేసుని డీజీపీ పరిశీలించడంతో అధికారులు కూడా సీరియస్ గానే ఉన్నారు. అయితే ఈ కేసు విషయంలో ఇప్పుడు ఏం జరుగుతుందనేది అర్ధం కావడం లేదు. అసలు ఫైల్స్ దగ్దం కేసు ముందుకు సాగడం లేదు. ముందుకు సాగని మదనపల్లి ఫైల్స్ దగ్ధం కేసు లో నిన్న కీలక పరిణామం చోటు చేసుకుంది. కేసుని సిఐడీకి అప్పగిస్తూ డీజీపీ ఉత్తర్వులు జారీ చేసారు. ఇప్పటి దాకా 9 కేసులు నమోదు చేసారు. ఇద్దరు ఆర్డీవోలు, సీనియర్ అసిస్టెంట్ మరో ఇద్దరు కానిస్టేబుళ్లు సస్పెండ్ చేసారు. ఇక సిఐని వీఆర్ కు పంపారు.

సస్పెన్షన్స్ తప్ప ఇప్పటి వరకు అరెస్ట్ లు జరగలేదు. ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు కోసం ఎదురుచూస్తున్నట్టుగా తెలుస్తోంది. రియల్ ఎస్టేట్ వ్యాపారుల పాత్రపై ఫోకస్ పెట్టారు. ఈ మేరకు పలువురిపై కేసులు, మరికొందరికి నోటీసులు జారీ చేసారు. అసలు కేసు దర్యాప్తు దారేటన్నదానిపై సస్పెన్స్ కొనసాగుతుంది. నిన్న మదనపల్లి ఘటన కేసు సిఐడి అప్పగిస్తూ డిజిపి తాజాగా ఉత్తర్వులు జారీ చేయడం మినహా ఈ కేసులో ఏ ముందు అడుగు పడలేదు. ఘటన జరిగిన రోజు నుంచే దర్యాప్తులో కీలకంగా వ్యవహరిస్తున్నది సిఐడి. ఇప్పటికే మదనపల్లి ఘటనపై జరుగుతున్న విచారణను స్వయంగా పర్యవేక్షిస్తున్న సిఐడి చీఫ్ రవిశంకర్ ఆయ్యన్నార్… ఎప్పటికప్పుడు అధికారులతో మాట్లాడుతున్నారు. కేసు దర్యాప్తు పూర్తిస్థాయిలో సిఐడి అప్పగించడంతో నిందితులు సహకరించిన వారిలో ఇప్పుడు ఆందోళన మొదలయింది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

బుకింగ్ క్యాన్సిల్.. ప్రయాణికులకు...

సాధారణంగా ఏదైనా అనుకోని అగ్ని ప్రమాదం...

సస్పెండ్ చేస్తే తిరువూరు...

తిరువూరు నియోజకవర్గం టీడీపీలో అలజడి కొనసాగుతోంది....

పులివెందులకు కేంద్రం గుడ్...

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్...

వరల్డ్ కప్‌కు మేం...

గత నాలుగు నెలల నుంచి భారత...

రోహిత్ రికార్డుల మోత.....

భారత క్రికెట్ అభిమానులకు టీమిండియా ఓపెనర్...

ఒక్కొక్కరికి కోటి ఇచ్చే...

బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయిన తర్వాతి...

పోల్స్