Friday, September 12, 2025 08:59 PM
Friday, September 12, 2025 08:59 PM
roots

లిక్కర్ స్కాంలో కీలక పరిణామం

ఆంధ్రప్రదేశ్ లో మద్యం కుంభకోణం పై రాష్ట్ర ప్రభుత్వంతోపాటుగా దర్యాప్తు బృందాలు పెద్ద ఎత్తున ఫోకస్ పెట్టాయి. దీనితో వైసిపి ప్రభుత్వం లో మద్యం కుంభకోణంలో కీలకంగా వ్యవహరించిన పలువురిపై కేసులు నమోదు చేయడానికి అధికారులు సిద్ధమవుతున్నారు. ప్రత్యేక దర్యాప్తు బృందం ఈ కేసును విచారిస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా వైసిపి కీలక నేతలు అప్పట్లో దీనిని ముందుండి నడిపించారు అని ఆరోపణలు వినిపించాయి. వైసిపి మాజీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి పేరు అప్పట్లో ప్రధానంగా వినపడింది.

Also Read : డ్రామా బయటపడుతుందని వైసీపీ భయపడుతోందా..?

అలాగే చిత్తూరు జిల్లాకు చెందిన రాజంపేట ఎంపీ మిధున్ రెడ్డి పేరు కూడా విమర్శల్లో ఉండేది. పార్లమెంట్లో టిడిపి ఎంపీ లావు కృష్ణదేవరాయలు చేసిన ఆరోపణలు తర్వాత మిధున్ రెడ్డి పై ఎక్కువగా దర్యాప్తు బృందాలు ఫోకస్ చేసాయి. కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థలు కూడా మిధున్ రెడ్డిని టార్గెట్ చేసుకున్నాయి అనే వార్తలు సైతం వచ్చాయి. ఇక ఇదిలా ఉంటే విజయసాయిరెడ్డికి తాజాగా నోటీసులు ఇచ్చారు అధికారులు. గురువారం ఉదయం 10 గంటలకు మద్యం కుంభకోణంలో విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.

Also Read : ఏఐ వీడియోలు.. పింక్ పార్టీకి మూడిందా..?

ఈ నేపథ్యంలో మద్యం కుంభకోణంలో రేపు ఉదయం 10 గంటలకు విచారణకు హాజరవుతున్నట్లు విజయసాయిరెడ్డి అధికారులకు సమాచారం ఇచ్చారు. తొలత ఈ నెల 18న విచారణకు రావాలని నోటీసులు ఇచ్చిన అధికారులు విజయసాయిరెడ్డి విజ్ఞప్తి మేరకు తేదీని మార్చారు. తనకు ముందుగా నిర్ణయించిన కార్యక్రమం ఉన్న నేపథ్యంలో 17వ తేదీన విచారణకు వస్తున్నానని ఆయన సమాచారం ఇచ్చారు. 17వ తేదీన విచారణకు రావాలని తాము రెడీ అని విజయసాయికి అధికారులు సమాచారం తిరిగి పంపారు. ఇక ఇదే కేసులో కీలకంగా ఉన్న కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డికి కూడా మరోసారి నోటీసులు ఇచ్చారు. విజయవాడ సిపి కార్యాలయంలో విచారణకు రావాలంటూ నోటీసుల్లో పేర్కొన్నారు. ఇప్పటివరకు మూడుసార్లు ఆయనకు నోటీసులు ఇచ్చినా సరే విచారణకు వెళ్లలేదు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్