ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత వేగవంతమైంది. ప్రత్యేక దర్యాప్తు బృందం కొన్ని కీలక అంశాలపై ఫోకస్ పెట్టింది. ఈ కేసులో కొన్ని పక్క ఆధారాలతో విచారణ మొదలుపెట్టిన సిట్ అధికారులు కొంతమంది కీలక వ్యక్తులను అరెస్టులు చేశారు. అందులో రాజకీయ నాయకులతో పాటుగా పలువురు అధికారులు కూడా ఉన్నారు. వీరిలో కొంతమందికి బెయిల్ రాగా మరి కొంత మంది ప్రస్తుతం జైల్లోనే ఉన్నారు. ఇక త్వరలోనే మరికొన్ని అరెస్టులు ఉండే అవకాశం ఉందనే ప్రచారం సైతం జరుగుతుంది.
Also Read : ఎస్పీలపై చంద్రబాబు గురి..? కారణం అదేనా
ముఖ్యంగా మాజీ మంత్రి నారాయణస్వామిని అరెస్టు చేసే అవకాశాలు ఉండొచ్చని తెలుస్తోంది. తాజాగా ఆయన ఫోన్ స్వాధీనం చేసుకున్న అధికారులు.. కోర్టు అనుమతితో ఆయన ఫోన్ ను ఎఫ్ ఎస్ ఎల్ కు పంపించారు. ఆయన కాల్ డేటా తో పాటుగా.. ఫోన్లో ఉన్న కీలక సమాచారాన్ని సేకరించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. లిక్కర్ కుంభకోణం జరిగిన సమయంలో ఆయన.. ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్నారు. తన ప్రమేయం లేకుండానే అన్నీ జరిగాయని ఆయన చెప్పిన సరే అధికారులు మాత్రం ఆయన పాత్ర పై అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
Also Read : మళ్ళీ బ్యాట్ పట్టిన రోహిత్.. టార్గెట్ ఫిక్స్..?
ఆయన బ్యాంకుల్లో పెద్ద ఎత్తున లావాదేవీలు జరిగి ఉండవచ్చు అనేది అధికారుల అనుమానం. అలాగే ఆయన సన్నిహితులు కూడా కొంతమంది ఈ వ్యవహారంలో పాలుపంచుకొని ఉండవచ్చని భావిస్తున్నారు. అప్పటి ప్రభుత్వ పెద్దలు ఆదేశాల మేరకు నారాయణస్వామి ఈ కుంభకోణం లో భాగం కావచ్చు అని అనుమానిస్తున్నారు. మద్యం తయారీ సంస్థలు నేరుగా ఆయనకు లబ్ధి చేకూర్చి ఉండవచ్చు అని సైతం అనుమానాలు ఉన్నాయి. సచివాలయంలో ఆయన పేషీలోనే ఈ ఒప్పందాలు జరిగాయి అనేది కూడా అప్పట్లో ప్రధాన ఆరోపణ. అందుకే అధికారులు ఆయనపై ఎక్కువగా గురిపెట్టారు.