ఆంధ్రప్రదేశ్ లో ఫైబర్ నెట్ వ్యవహారం తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఏకంగా ఆ సంస్థ చైర్మన్ బాధ్యతల నుంచి జీవీ రెడ్డి రాజీనామా చేసే వరకు సమస్య వెళ్ళింది. ముఖ్యంగా వైసీపీ హయాంలో పెద్ద ఎత్తున నియామకాలు చేపట్టడంతో సంస్థ భారీగా నష్టాల్లో కూరుకుపోయింది. దీనిపై జీవీ రెడ్డి పలు మార్లు మీడియా సమావేశాలు కూడా నిర్వహించి ఆరోపణలు చేసారు. సంస్థలో ఉన్నతాధికారుల నుంచి సహకారం లేకపోవడం, అటు ప్రభుత్వం కూడా పట్టించుకోకపోవడంతో రాజీనామా చేసారు జీవీ రెడ్డి.
Also Read : డ్రామా బయటపడుతుందని వైసీపీ భయపడుతోందా..?
ఇది రాజకీయంగా కూడా దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత క్రమంగా సంస్థలో మార్పులు కూడా చోటు చేసుకుంటూ వచ్చాయి. కొందరు కీలక ఉద్యోగులను ప్రభుత్వం తప్పించింది. ఎండీని కూడా పక్కన పెట్టిన పరిస్థితి. ఇక తాజాగా మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏపి ఫైబర్ నెట్ ఉద్యోగులపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఫైబర్ నెట్‌లో దాదాపు 500 మంది ఉద్యోగులను సర్కార్ తొలగించింది. సూర్య ఎంటర్‌ప్రైజెస్ ద్వారా నియమించిన వారందరు కూడా ఈ నెలాఖరుకు ఫైబర్ నెట్ నుంచి బయటకు రానున్నారు.
Also Read : మళ్ళీ సాయి రెడ్డేనా..? రాజ్యసభ ఉప ఎన్నిక సందడి షురూ
ఇక ముందు ఎటువంటి పొడిగింపు ఉండబోదని సంస్థ యాజమాన్యం స్పష్టం చేసింది. ఈ ఉద్యోగులంతా కూడా ఫైబర్ నెట్ కార్యాలయానికి రాకుండా జీతాలు తీసుకున్న పరిస్థితి ఉండటంతో తీవ్ర విమర్శలు వచ్చాయి. వైసీపీ సోషల్ మీడియాకు వీరు పని చేయగా ఇప్పటి వరకు సంస్థ నుంచి జీతాలు తీసుకుంటున్నారు అనే విమర్శలు వచ్చాయి. దీనిపై దృష్టిసారించిన కూటమి ప్రభుత్వం దాదాపు 500 మందిని ఫైబర్ నెట్ నుంచి తొలగించింది. త్వరలోనే మరికొందరు ఉద్యోగులను తప్పించే అవకాశం ఉంది.