Tuesday, October 28, 2025 06:58 AM
Tuesday, October 28, 2025 06:58 AM
roots

మళ్లీ సీఎం కుర్చీలో కేజ్రీవాల్..?

ముఖ్యమంత్రిగా అరవింద్ కేజ్రీవాల్.. ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలంతా ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు రెడీ అయ్యారు.. ఇక నుంచి సీఎం కేజ్రీవాల్.‌.. ఇదేంటి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఓడింది కదా… మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా ఓడిపోయారు కదా.. మరి మళ్లీ సీఎం కుర్చీలో కూర్చోవటం ఏమిటి అని అనుమానిస్తున్నారా… ఎలాంటి అనుమానం లేదు.. ఫుల్ క్లారిటీతోనే ఈ వార్త రాయటం జరిగింది. సీఎం కుర్చీలో కేజ్రీవాల్ కూర్చునేందుకు అంతా రెడీ అయ్యింది.. అయితే అది ఢిల్లీలో కాదు.. పంజాబ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్ ను ఎన్నుకునేందుకు ఆప్ ఎమ్మెల్యేలు సిద్ధమయ్యారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో ఓడినప్పటికీ తమ‌ అధినేతను సీఎంగా చూడాలని ఆప్ నేతలు బలంగా ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో సీఎం అరవింద్ కేజ్రీవాల్ అనే మాట ఇప్పుడు బాగా వినిపిస్తోంది.

Also Read : గతం మర్చిపోయి నోరుజారిన కేసీఆర్

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ 48 స్థానాలను సొంతం చేసుకోగా… ఆమ్ ఆద్మీ పార్టీ మాత్రం కేవలం 22 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. అయితే ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కూడా ఓడిపోయారు. దీంతో కనీసం ఎమ్మెల్యేగా కూడా అవకాశం రాలేదు. ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో జైలు జీవితం గడిపిన కేజ్రీవాల్… ఏ పదవి లేకపోతే మరిన్ని చిక్కులు వస్తాయని భయపడుతున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి సమయంలో ఒక పదవి ఉండాలని భావిస్తున్నట్లు సమాచారం.

Also Read : జగన్ పొలిటికల్ ప్లాన్ వర్కవుట్ అవుతుందా..?

ఈ సమయంలో ఆప్ ఎదురుగా ఉన్న ఒకే ఒక్క అవకాశం పంజాబ్. 2022లో జరిగిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ 93 స్థానాల్లో గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. సీఎంగా భగవంత్ మాన్ ను ఆ పార్టీ నేతలు ఎన్నుకున్నారు. అయితే తొలి నుంచి భగవంత్ తీరుపై విమర్శలు వస్తూనే ఉన్నాయి. దీంతో భగవంత్ మాన్ ను మార్చాలని కొందరు నేతలు పట్టుబడుతున్నారు. ఈ నేపథ్యంలో పంజాబ్ సీఎం కుర్చీలో కేజ్రీవాల్ ను కూర్చోబెట్టి… బీజేపీకి షాక్ ఇవ్వలని కూడా ఆప్ నేతలు భావిస్తున్నారు. తమతో 30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారంటూ కాంగ్రెస్ నేత ప్రతాప్ సింగ్ చేసిన వ్యాఖ్యలకు ఆప్ కౌంటర్ ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.....

తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక...

ఐసీయూలో శ్రేయస్ అయ్యర్.....

సౌత్ ఆఫ్రికా తో కీలక వన్డే...

చావులోను ఆగని విష...

సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మానవత్వంతో...

గట్టిగానే సంక్రాంతి పోటీ.....

సంక్రాంతి పండుగ.. తెలుగు వారికి అతి...

బ్రేకింగ్: పరకామణి కేసులో...

గత కొన్నాళ్లుగా తిరుమలలో పరకామణి వ్యవహారం...

కొత్త జిల్లాలు.. మారనున్న...

ఏపీలో జిల్లాల పునర్‌ విభజన ప్రక్రియ...

పోల్స్