తెలంగాణా రాజకీయాల్లో బాంబులు పేలుస్తున్న ఎమ్మెల్సీ కవిత.. తాజాగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేసారు. తన తండ్రి తనకు స్ఫూర్తి అని.. ఆయన చిటికెన వేలు పట్టుకుని ఎదిగానని చెప్పిన ఆమె.. 79 ఏళ్ల స్వాతంత్ర్య దేశంలో దళితులకు మూడు ఎకరాలు ఇస్తానన్న ఏకైక నాయకుడు అని స్పష్టం చేసారు. బీసీలకు న్యాయం చేసిన నేతని వ్యాఖ్యానించారు. సామాజిక తెలంగాణ బీ ఆర్ ఎస్ సిద్ధాంతానికి వ్యతిరేకమా..? బంగారు తెలంగాణ అంటే ఏంటని ఆమె ప్రశ్నించారు.
Also Read : కవితకు బండి సంజయ్ గాలం..?
తనపై కుట్ర జరిగిందని కవిత ఆవేదన వ్యక్తం చేసారు. మా రామన్న ను గడ్డం పట్టుకుని బ్రతిమిలాడాను, పార్టీ ఆఫీసు నుండి నాపై దుష్ప్రచారం కుట్రలు జరుగుతున్నాయి అని చెప్పాను.. వెంటనే చర్యలు తీసుకోవాలని కోరానని సంచలన కామెంట్స్ చేసారు. కానీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన మా అన్న నుండి స్పందన రాలేదు కాబట్టి నాకు అర్థమైందన్నారు. నా సస్పెన్షన్ రాగానే ఐదుగురు మహిళా నేతలు భవన్ లో కూర్చుని మాట్లాడారని, సంతోషమే.. మహిళలు రావాలి ఎదగాలన్నారు.
ఎవరైతే పార్టీని స్వార్థ ప్రయోజనాలు వ్యక్తిగతం కోసం వాడుకోవాలనుకుంటున్నారో… వాళ్ళే మా కుటుంబాన్ని విచ్చిన్నం చేసే కుట్రలు పన్నుతున్నారని మండిపడ్డారు. మా తండ్రి కేసీఆర్ కు సూచన చేస్తున్నాను.. ఇలాంటి కుట్రలకు మీరు రామన్న బలికావొద్దని కోరారు. హరీష్ రావు కు.. రేవంత్ రెడ్డి కి సూటి ప్రశ్న, మీరిద్దరూ హైదరాబాద్ నుండి డిల్లీ కి వెళ్ళే క్రమంలో హరీష్ రావు రేవంత్ రెడ్డి కాళ్ళు పట్టుకున్న తర్వాత నాపై కుట్రలకు బీజం పడింది.. ఇది నిజం కాదా..? ఇద్దరు చెప్పాలి అని ఆమె డిమాండ్ చేసారు.
Also Read : మీ డెసిషన్ ఫైనల్.. మంత్రి పదవిపై చంద్రబాబుకు పవన్ క్లారిటీ
హరీష్ రావు అప్పట్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి నీ కలిసి ఆయనతో కుమ్మక్కు అవలేదా అని నిలదీశారు. ఆయన ట్రబుల్ షూటర్ కాదు.. డబుల్ షూటర్ అన్నారు. కాళేశ్వరం అవినీతిలో హరీష్ రావు దే పూర్తి పాత్ర అని స్పష్టం చేసారు. రంగనాయక సాగర్ లో ఫామ్ హౌస్.. పాల వ్యాపారాలపై సీఎం పీ ఆర్ ఓ అయోధ్యరెడ్డి ట్వీట్లు పెట్టాడని, తర్వాత మాయం అయ్యాయన్నారు. హరీష్ రావు దగ్గర అన్ని డబ్బులు ఎక్కడివని నిలదీశారు. ఎక్కడినుండి వచ్చాయన్నారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి తనవద్ద పెట్టుకోవడానికి వ్యూహం పన్నలేదా అని ప్రశ్నించారు.
2009 లో రామన్న ను ఒడిగొట్టడానికి హరీష్ రావు 60 లక్షలు పంపించాడన్నారు. కేసీఆర్ కుటుంబాన్ని ఒడిగొట్టడానికి విచ్చిన్నం చేయడానికి హరీష్ రావు కుట్రలు చేసింది వాస్తవం అంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు. హరీష్‌రావు, రేవంత్‌రెడ్డి ఒకే ఫ్లైట్‌లో పర్యటించినప్పటి నుంచే నాపై కుట్రలు మొదలయ్యాయి.. రేవంత్, హరీష్‌రావు కుమ్మక్కై నాపై కుట్రలు చేశారు.. రేవంత్‌తో హరీష్‌రావు ఒకే ఫ్లైట్‌లో వెళ్లారా లేదా చెప్పండి? అని నిలదీశారు. రేపు మా అన్నకు కూడా ఇలాంటి పరిస్థితే వస్తుందన్నారు కవిత.