తెలంగాణా ప్రతిపక్ష పార్టీలో ముసలం కొనసాగుతోంది. అధికారం కోల్పోయి ఇబ్బందులు పడుతున్న ఆ పార్టీలో ఇప్పుడు చీలికల భయం మొదలైంది. కల్వకుంట్ల కవిత అసమ్మతి గళం వినిపించడం ఆ పార్టీ క్యాడర్ ను కంగారు పెడుతోంది. తాజాగా ఆమె సంచలన కామెంట్స్ చేసారు. బీఆర్ఎస్‌ను బీజేపీలో విలీనం చేసే కుట్ర జరుగుతోందని సంచలన వ్యాఖ్యలు చేసారు. నేను జైలులో ఉన్నప్పుడే కుట్ర మొదలైందని బాంబు పేల్చారు. ఇంటి ఆడబిడ్డపై పెయిడ్ ఆర్టిస్టులతో మాట్లాడిస్తారా అని మండిపడ్డారు. నా మీద పడి ఏడిస్తే ఏమొస్తుందని నిలదీశారు.
Also Read : మద్దతు ప్లీజ్.. హస్తినకు జగననన్న
జైలుకు వెళ్లేటప్పుడే పార్టీకి రాజీనామా చేస్తానన్నా అని.. లీకువీరులను పట్టుకోమంటే, గ్రీకువీరులు దండెత్తారు అని మండిపడ్డారు. నాజోలికి వస్తే బాగుండదని హెచ్చరించారు. కేసీఆర్‌ను మేమే నడిపిస్తున్నామని చెప్పుకుంటున్నారని, కేసీఆర్‌ను నడిపించేంత పెద్దవాళ్లా మీరు అని నిలదీశారు. నాపై తప్పుడు వార్తలను పార్టీ ఎందుకు ఖండించలేదు అని ప్రశ్నించారు. పార్టీ సోషల్ మీడియాలో నన్ను టార్గెట్ చేశారని.. నా లేఖ లీక్ చేసిందెవరో చెప్పాల్సిందే అని ప్రశ్నించారు.
Also Read: కవిత కొత్త పార్టీకి ముహుర్తం ఖరారు..!
కేసీఆర్‌కు నోటీసులు వస్తే ఎందుకు నిరసనలు తెలపలేదని ప్రశ్నించారు. ఇంకో నేతకు నోటీసులు వస్తే ఎందుకు హంగామా అని నిలదీశారు. నేను వాళ్లలా చిచోరా రాజకీయాలు చేయను, హుందాగా ఉంటా అని స్పష్టం చేసారు. పార్టీచేయాల్సిన పనులు జాగృతి తరపున నేను చేస్తున్నాను అన్నారు. కోవర్టులు ఉన్నప్పుడు ఎందుకు పక్కనపెట్టడం లేదు అని ప్రశ్నించారు. బీఆర్ఎస్‌లో కేసీఆర్ ఒక్కరే నాయకుడు అని స్పష్టం చేసారు. పార్టీలో ఇంకెవరి నాయకత్వాన్ని అంగీకరించను అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఓ మునిగిపోయే నావ అన్నారు. కాంగ్రెస్‌తో రాయబారాలు జరిపే అవసరం నాకు లేదు అని స్పష్టం చేసారు. నాకు, కేసీఆర్ మధ్య దూరం పెంచే కుట్ర జరుగుతోందన్నారు. నన్ను దూరం చేస్తే ఎవరికి లాభమో అందరికీ తెలుసన్నారు.




