“కాంతారా” అతి తక్కువ బడ్జెట్ తో వచ్చి సిల్వర్ స్క్రీన్ ను షేక్ చేసిన సినిమా ఇది. రిషబ్ శెట్టి డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో దుమ్ము రేపింది. దీనితో ఈ సినిమా తర్వాతి చాప్టర్ లపై జనాల్లో ఆసక్తి పెరిగిపోయింది. ఇప్పుడు కాంతారా ప్రీక్వెల్ అంటూ.. కాంతారా కథకు ముందు అసలేం జరిగింది అనేది చూపిస్తున్నారు. దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి. సౌత్ ఇండియాతో పాటుగా నార్త్ ఇండియాలో కూడా ఈ సినిమాపై జనాల్లో చర్చ నడుస్తోంది.
Also Read : బన్నీ టార్గెట్ వేరే లెవెల్.. మరీ ఈ రేంజ్ లోనా..?
ముందు ఈ సినిమాను తక్కువ బడ్జెట్ తో చేసిన హోంబలే ఫిల్మ్స్.. చాప్టర్ 1 కు మాత్రం భారీగా ఖర్చు చేయడానికి రెడీ అయిపొయింది. కాంతారా కంటే కూడా ప్రీక్వెల్ లో ఎలివేషన్ సీన్స్, యాక్షన్ సీన్స్ ఎక్కువగా ఉంటాయి. కాంతారాలో క్లైమాక్స్ మాత్రమే ఆసక్తిగా ఉంటుంది. ప్రీక్వెల్ లో మాత్రం ఒక్కో సీన్ గూస్ బంప్స్ అంటున్నాయి కన్నడ సినీ వర్గాలు. అజనీష్ లోక్‌నాథ్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా కోసం బాలీవుడ్ స్టార్ హీరో కూడా ఒకరు పని చేసినట్టు వార్తలు వచ్చాయి.
Also Read : వీరమల్లుకు లైన్ క్లియర్.. కండీషన్స్ ఇవే
మన తెలుగు నుంచి ఎన్టీఆర్ కూడా నటిస్తున్నాడు అనే ప్రచారం జరిగింది. ఇక లేటెస్ట్ గా కాంతారా ప్రీక్వెల్ షూటింగ్ పూర్తి కాగా, దానికి సంబంధించిన వీడియోను మేకర్స్ రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ వస్తోంది. హీరో రిషబ్ శెట్టి డైరెక్టర్ గా, యాక్టర్ గా ఎంత కష్టపడ్డాడో ఈ వీడియోలో చూపించారు. చిత్ర యూనిట్ ఈ సినిమాను అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు. సాంస్కృతిక అనుభవం సినిమాను ఏ రేంజ్ కు తీసుకువెళ్తుందో చూడాలి.