సినిమాల్లో గాని సామాజిక జీవితంలో గాని మంచు కుటుంబం ఖచ్చితంగా స్పెషల్ అనే చెప్పాలి. ఆ కుటుంబం గురించి ఏ వార్త వచ్చినా జనాలు కాస్త కామెడి గానే తీసుకుంటున్నారు. ముఖ్యంగా మంచు విష్ణు మాట్లాడే మాటలు ఈ మధ్య సోషల్ మీడియాలో కామెడి అవుతున్నాయి. మంచు కుటుంబంలో అంత పెద్ద గొడవలు జరిగినా జనాలు మాత్రం వాటిని కామెడి గానే తీసుకోవడం ఆశ్చర్యం కలిగించిన అంశంగా చెప్పాలి. ప్రస్తుతం కుటుంబ గొడవలు ముగింపు దశకు చేరుకున్నాయి.
Also Read : రిటర్న్ గిఫ్ట్ కు థాంక్స్.. టాలీవుడ్ పై పవన్ ఫైర్
ఇక ఇదే సమయంలో మంచు విష్ణు ఓ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. కన్నప్ప అనే సినిమాతో ప్రేక్షకులను ఎలాగైనా సరే అలరించాలని, వినోదం పంచాలని ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారు. త్వరలోనే ఈ సినిమా విడుదల అవుతుందనే సంకేతాలు కూడా ఇచ్చారు. మలయాళం స్టార్ హీరో మోహన్ లాల్, బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్, తెలుగులో రెబల్ స్టార్ ప్రభాస్ ఇలా చాలా మంది ఈ సినిమాలో ప్రముఖులు నటిస్తున్నారు. పాన్ ఇండియా సినిమాగా భారీ బడ్జెట్ తో ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు.
Also Read : నభా నటేష్
ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్, టీజర్ లు ఇలా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అయితే ఈ సినిమా హార్డ్ డిస్క్ గురించి మంచు విష్ణు చేసిన ఓ ప్రకటన సంచలనం అయింది. సినిమాలో కీలక సన్నివేశాలు ఉన్న హార్డ్ డిస్క్ తో ఎడిటర్ పారిపోయాడని కామెంట్ చేసాడు. అతని మీద కేసు నమోదు చేసామన్నాడు. ఇది విన్న జనాలు షాక్ అయ్యారు. భారీ బడ్జెట్ తో చేస్తున్న సినిమాకు ఒకటే హార్డ్ డిస్క్ లో డేటా ఉండటం ఏంటని.. అది కూడా పోవడం ఏంటని ఆశ్చర్యపోతున్నారు. అసలు సినిమా విడుదల చేస్తారా లేదా చెప్పాలంటూ సెటైర్ లు వేస్తున్నారు.




