Monday, October 27, 2025 10:33 PM
Monday, October 27, 2025 10:33 PM
roots

అన్నతో సయోధ్య కుదిరినట్టే..?

గత నెల రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కల్వకుంట్ల కవిత హాట్ టాపిక్ అయిపోయారు. రాజకీయంగా బలహీనంగా ఉన్న గులాబీ పార్టీలో కవిత వ్యవహారం కొందరికి బీపీ పెంచింది. కోపం ఎవరి మీదనో తెలియదు గాని కోపం మాత్రం తీవ్రంగా ఉన్నట్టు సంకేతాలు వచ్చాయి. అలాంటి కవిత ఇప్పుడు సిట్ రైట్ అయినట్టు కనపడుతున్నారు. మొన్నటి వరకు బీఆర్ ఎస్ లోని కొంత మంది నాయకులపై ఫైర్ అయిన కవిత.. ఇప్పుడు జాగ్రత్తగా మాట్లాడటం మొదలుపెట్టారు.

Also Read : రేవంత్ రెడ్డి – ఆరా మస్తాన్ ఫోన్ ట్యాపింగ్.. ఆధారాలతో బయటపెట్టిన సిట్

గతంలో తండ్రి కేసీఆర్ వద్ద కొంతమంది దయ్యాలు ఉన్నాయంటూ వ్యాఖ్యలు చేసిన ఆమె.. వరుసగా జాగృతి పేరు మీద కార్యక్రమాలతో బీఆర్ ఎస్ లో హీట్ పెంచారు. కవిత తో టచ్ లోకి వెళ్లిన కొంతమంది ఎమ్మెల్యేలు.. మీ వెంటే నడుస్తామని ఆమెకు హామీ కూడా ఇచ్చారనే ప్రచారం సైతం జరిగింది. పార్టీ లో కవిత వ్యవహారం పై కేసీఆర్ వద్ద పంచాయితీ పెట్టారు కొందరు సీనియర్ నేతలు. అక్కడి నుంచి కవిత పై క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశం అంటూ గతంలో ఊహాగానాలు కూడా వినిపించాయి.

Also Read : సిఎం వర్సెస్ డిప్యూటి సిఎం.. కన్నడ నాట ఏం జరుగుతోంది..?

కానీ రెండు రోజుల నుండి స్వరం మార్చిన కవిత.. నేను బీఆర్ ఎస్ పార్టీ లొనే ఉంటా …ఇది నా పార్టీ నేను ఎందుకు బయటకి పోతా అంటూ వ్యాఖ్యలు చేసారు. జాగృతి నేతలు ఎవరైనా స్థానిక ఎన్నికల్లో పోటీ చేయాలి అంటే కేటీఆర్ అని కలిసి మాట్లాడుకోవచ్చు అంటూ తాజా వ్యాఖ్యలు చేసారు. రాష్ట్రం లో బీజేపీ అధ్యక్ష మార్పు జరిగిన తర్వాత రాజకీయ వాతావరణంలో మార్పు వచ్చినట్టు గానే కనపడుతోంది. పార్టీ లో లుకలుకలు లేకుండా పార్టీ బలోపేతం పై దృష్టి పెట్టాలంటూ పార్టీ నేతలకు అధినాయకత్వం ఆదేశాలు ఇచ్చినట్టు వార్తలు వస్తున్నాయి.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.....

తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక...

ఐసీయూలో శ్రేయస్ అయ్యర్.....

సౌత్ ఆఫ్రికా తో కీలక వన్డే...

చావులోను ఆగని విష...

సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మానవత్వంతో...

గట్టిగానే సంక్రాంతి పోటీ.....

సంక్రాంతి పండుగ.. తెలుగు వారికి అతి...

బ్రేకింగ్: పరకామణి కేసులో...

గత కొన్నాళ్లుగా తిరుమలలో పరకామణి వ్యవహారం...

కొత్త జిల్లాలు.. మారనున్న...

ఏపీలో జిల్లాల పునర్‌ విభజన ప్రక్రియ...

పోల్స్