Saturday, September 13, 2025 07:09 AM
Saturday, September 13, 2025 07:09 AM
roots

తాడిపత్రి కూటమిలో విభేదాలు..!

ఓ వైపు పార్టీల అధినేతలు కలిసిమెలిసి తిరుగుతుంటే… ద్వితీయ శ్రేణి నేతలు, కిందస్థాయి నేతలు మాత్రం ఆధిపత్యం కోసం నానా పాట్లు పడుతున్నారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో కూటమి నేతల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ప్రధానంగా మునిసిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డికి, బీజేపీ నేతలకు మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. చివరికి బీజేపీ నేతలపై ఘాటు విమర్శలు చేసిన జేసీ ప్రభాకర్ రెడ్డి… వీళ్ల కంటే జగన్ బెటరంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి. జేసీ ప్రభాకర్ రెడ్డికి బీజేపీ నేతలకు మధ్య కొంతకాలంగా తాడిపత్రిలో ఆధిపత్య పోరు నడుస్తోంది. చివరికి ఎన్నికల సమయంలో కూడా బీజేపీ నేతలు జేసీ అస్మిత్ రెడ్డికి వ్యతిరేకంగా పనిచేశారనే ఆరోపణలు వెల్లువెత్తాయి కూడా. అయినా సరే ఈ ఎన్నికల్లో జేసీ అస్మిత్ రెడ్డి భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఇక ఎన్నికల తర్వాత నుంచి టార్గెట్ జేసీ అన్నట్లుగానే బీజేపీ నేతలు వ్యాఖ్యలు చేస్తున్నారు.

Also Read : రిపోర్ట్ ఏది..? ఎన్ని సార్లు అడగాలి..? చంద్రబాబు సీరియస్

న్యూ ఇయర్ సందర్భంగా జేసీ ప్రభాకర్ రెడ్డి ఓ ఈవెంట్ నిర్వహించారు. ఈ వేడుకకు మహిళలకు మాత్రమే ప్రవేశం అని సూచించారు. పురుషులకు నో ఎంట్రీ బోర్డు పెట్టారు. ఎవరైనా అటువైపు వస్తే కాళ్లు విరగొడతా అంటూ జేసీ మాస్ వార్నింగ్ కూడా ఇచ్చారు. అయితే ఈ ఈవెంట్‌పై బీజేపీ మహిళా నేత మాధవీలత ఓ వీడియో రిలీజ్ చేశారు. ఈ ఈవెంట్‌కు ఎవరూ వెళ్లొద్దని సూచించారు. ఈవెంట్ జరిగే ప్రదేశం ఊరి చివర్లో ఉందని… వేడుక చేసుకోకపోతే వచ్చే నష్టం లేదన్నారు. వేడుకలో పాల్గొన్న మహిళలకు ఏమైనా జరిగితే ఎవరిది బాధ్యత అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ వేడుక గ్రాండ్ సక్సెస్‌ కావడంతో మాధవీలతపై తెలుగు మహిళా నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మాధవీలతపై చర్యలు తీసుకోవాలంటూ పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు.

Also Read : షిర్డీసాయి ఎలక్ట్రికల్స్‌ కు మైండ్ బ్లోయింగ్ షాక్ ఇచ్చిన ఏపీ సర్కార్..!

ఇదే సమయంలో దివాకర్‌ ట్రావెల్స్‌కు చెందిన 5 బస్సులు అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ప్రమాదానికి విద్యుత్ షార్ట్‌ సర్క్యూట్‌ కారణమని పోలీసులు కేసు నమోదు చేశారు. బస్టాండ్‌ ఎదురుగా పార్కింగ్‌ చేసిన బస్సులపై హై టెన్షన్‌ విద్యుత్‌ వైర్‌ తెగిపడటంతో బస్సులు తగలబడినట్లు పోలీసులు వెల్లడించారు. దీనిపై జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బస్సులను బీజేపీ నేతలే తగులబెట్టారని ఆరోపించారు. మీకంటే జగన్ నయమని… జగన్ కేవలం కేసులు పెట్టి బస్సులు తిరగకుండా ఆపేశాడని… బీజేపీ నేతలు ఏకంగా బస్సులే తగులబెట్టారని జేసీ ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. ఆ బస్సులు తనవి కావని… తన వద్ద పనిచేసే డ్రైవర్‌లకు ఇచ్చేశామన్నారు. ఇప్పుడు వారి పొట్ట కొట్టారు కదా మీరు అంటూ జేసీ విమర్శించారు.

ప్రస్తుతం తాడిపత్రిలో జేసీ వర్సెస్‌ బీజేపీ అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. వైసీపీ నేతలు మాత్రం ఈ వివాదం జోలికి వెళ్లకుండా దూరంగా ఉండి గమనిస్తున్నారు. టీడీపీ నేతలు జేసీకి మద్దతుగా నిలుస్తున్నారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్