సినిమా పరిశ్రమలో ప్రకంపనలు రేపుతున్న జానీ మాస్టర్ అత్యాచారం వ్యవహారంలో పోలీసులు కీలక ముందడుగు వేసారు. గురువారం గోవా లో జానీ మాస్టర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అత్యాచారం కేసు నమోదు అయినప్పటి నుంచి జానీ మాస్టర్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని పరారీలోనే ఉన్నాడు. అప్పటి నుంచి హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో గాలించిన పోలీసులు చివరికి భార్యను విచారించగా సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇక భార్యపై కూడా ఈ కేసులో ఆరోపణలు వచ్చాయి. ఆమె కూడా తనను వేధించింది అని బాధితురాలు ఫిర్యాదు చేసింది.
తాజాగా పోలీసులు ఈ అరెస్ట్ పై అధికారిక ప్రకటన చేసారు. జానీ భాషా అలియాస్ జానీ మాస్టర్ పై రాయదుర్గం పీఎస్ లో నమోదైన కేసును.. నార్సింగ్ పీఎస్ లో రీ రిజిస్టర్ చేశామని పోలీసులు తెలిపారు. బాధితురాలు ఫిర్యాదు మేరకు జానీ మాస్టర్ పై కేసు నమోదు చేశామన్నారు. 2020 లో తన అసిస్టెంట్ గా ఉన్న యువతి పై జానీ మాస్టర్ లైంగిక దాడికి పాల్పడ్డాడని తెలిపారు. అప్పుడు ఆమె మైనర్ అని ముంబై లో ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు అంటూ సంచలన కామెంట్స్ చేసారు పోలీసులు.
Read Also : ఆపరేషన్ బుడమేరు స్టార్ట్
జానీ మాస్టర్ పై పోక్సో కేసు కూడా పెట్టామన్నారు. జానీ మాస్టర్ గోవా లో ఉన్నట్లు గుర్తించి.. అదుపులోకి తీసుకున్నామని మీడియాకు వివరించారు. గోవా కోర్టులో ప్రవేశపెట్టి.. ట్రాన్సిట్ వారెంట్ కింద హైదారాబాద్ తీసుకొస్తున్నామన్నారు. ఇక జనసేన పార్టీ నుంచి కూడా జానీ మాస్టర్ ను సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. బాధితురాలికి అల్లు అర్జున్ అండగా నిలబడ్డాడు అనే వార్తలు కూడా వచ్చాయి. గీతా ఆర్ట్స్ లో ఉద్యోగంతో పాటుగా తను నటించే అన్ని సినిమాల్లో అవకాశం కల్పిస్తా అని హామీ ఇచ్చాడు. మరి ఈ కేసు బయటకి వచ్చి, బాధితురాలికి న్యాయం జరగడంతో మరికొందరు కూడా ధైర్యంగా బయటకి వచ్చే అవకాశం ఉందని పరిశ్రమలో ప్రచారం జరుగుతుంది.