పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఇటీవల ఇజ్రాయిల్, ఇరాన్ దేశాల మధ్య యుద్ధం ముగిసినట్టే కనపడినా ఇప్పుడు మరోసారి ఉద్రిక్తత చెలరేగింది. ఇజ్రాయిల్ ఇచ్చిన వార్నింగ్ తో ఇరాన్ ఏ చర్యలకు దిగే అవకాశం ఉందనే దానిపై ఆందోళన నెలకొంది. ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్.. ఇరాన్‌ను బెదిరించింది. తమ దేశం మరోసారి టెహ్రాన్ లో అడుగుపెట్టడం ఖాయమని, ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీని పర్సనల్ గా టార్గెట్ చేస్తుందని ఆయన వార్నింగ్ ఇచ్చారు.
Also Read : సచిన్ ను గుర్తు చేసిన సుందర్.. 1990 టూ 2025
గతంలో కూడా కాట్జ్ ఇలాగే వార్నింగ్ ఇచ్చాడు. ఆదివారం ఇజ్రాయెల్ వైమానిక దళానికి చెందిన రామన్ వైమానిక స్థావరాన్ని సందర్శించిన సందర్భంగా కాట్జ్ ఈ వ్యాఖ్యలు చేశారు. నియంత ఖమేనీకి స్పష్టమైన సందేశం ఇవ్వాలనుకుంటున్నాను అంటూ.. మీరు ఇజ్రాయెల్‌ను బెదిరించడం ఆపకపోతే.. మా క్షిపణి ఇరాన్ చేరుకుంటుందని వార్నింగ్ ఇచ్చారు. మరింత బలంగా ఇరాన్ లో అడుగు పెడతామని, ఈ సారి సుప్రీం లీడర్ తమ టార్గెట్ అని ఆయన హెచ్చరించారు.
Also Read : రోగులు ఏటీఎంలు కాదు.. హైకోర్ట్ సంచలన కామెంట్స్
ఇజ్రాయెల్‌ను బెదిరించవద్దని ఇరాన్‌ను హెచ్చరించారు. మీరు బెదిరించడం ఆపితే మీకు ఏ సమస్యా లేదన్నారు. ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు సమక్షంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేసారు. వైమానిక స్థావరంలో జెట్ ఫైటర్ సిబ్బందిని కూడా కాట్జ్ ప్రశంసించారు. ఆపరేషన్ రైజింగ్ లయన్ సమయంలో సైనిక సిబ్బంది చేసిన కృషిని కొనియాడారు. వైమానిక మార్గాన్ని తెరిచారని, ఎప్పుడైనా మీకు ముప్పు తప్పదు అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇరాక్ మాజీ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్ లాగా ఖమేనీని చంపేస్తామని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి జూన్ 17న వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్ మరియు ఇజ్రాయెల్ మధ్య యుద్ధం గత నెలలో కాల్పుల విరమణ ఒప్పందంతో ముగిసిన సంగతి తెలిసిందే.