కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్లుంది… వైసీపీ నేతల తీరు. ఏ చిన్న కారణం దొరుకుతుందా.. దానిని పట్టుకుని సాగదీద్దామా అనేది వైసీపీ నేతల ప్లాన్. కూటమి పాలన ఏడాది పూర్తి చేసుకున్న సమయంలో ప్రభుత్వంపై బురద జల్లేందుకు వైసీపీ అధినేత బెంగళూరు నుంచి నేరుగా తాడేపల్లికి వచ్చేశారు. ఎన్నికల తర్వాత నెలా, రెండు నెలలు బెంగళూరు ప్యాలెస్‌లో అజ్ఞాత వాసంలోకి వెళ్లిపోయారు జగన్. వైసీపీలో ముఖ్యనేతలంతా ఒక్కొక్కరుగా పార్టీ మారుతుండటంతో… ఇక తప్పదన్నట్లుగా ఏపీకి వస్తూ పోతూ ఉన్నారు. జిల్లాల్లో పర్యటిస్తా.. రివ్యూలు నిర్వహిస్తా.. మళ్లీ ఎన్నికల్లో గెలుస్తామంటూ పెద్ద పెద్ద మాటలు చెప్పారు. అయితే.. ఒక్క జిల్లాలో కూడా పర్యటించలేదు. చివరికి పార్టీ నిర్ణయించిన కార్యక్రమాల్లో కూడా జగన్ పాల్గొనలేదు. దీంతో.. అధినేత తీరుపై నేతలు, కార్యకర్తలు కాస్త విసుగు చెందారు. ఇలాగే ఉంటే.. పార్టీ మూతపడుతుందేమో అనే భయంతో మళ్లీ పాత పాటే పాడుతున్నారు జగన్.
Also Read : జగన్ పై క్యాడర్ లో పెరుగుతోన్న కోపం.. కారణం ఇదే
తనకు బాగా కలిసి వచ్చిన ఓదార్పు యాత్రనే మళ్లీ ఎంచుకున్నారు. అందుకే ముందుగా వినుకొండతో తన పరామర్శ పర్యటన మొదలుపెట్టారు. ఆ తర్వాత నుంచి లేడిస్ టైలర్ సినిమాలో డైలాగ్ మాదిరిగా.. ఎక్కడా శవం అని ఎదురు చూశారు. అప్పడే పొగాకు రైతుల సమస్యలంటూ బయటకు వచ్చారు. మంచి పబ్లిసిటీ రావడంతో.. వెంటనే సత్తెనపల్లి టూర్‌కు ముహుర్తం ఫిక్స్ చేశారు. వాస్తవానికి ఏడాది క్రితం బెట్టింగ్ కారణంగా నష్టపోయినందుకు ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి కుటుంబాన్ని ఇప్పుడు పరామర్శించారు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా జగన్ ఉన్న సమయంలోనే వైసీపీ కార్యకర్త ఆత్మహత్య చేసుకున్నాడు. అయినా సరే.. కూటమి నేతల వేధింపుల వల్లే ఆత్మహత్య చేసుకున్నాడని తప్పుడు ఆరోపణలు చేశారు. ఆ తర్వాత ప్రెస్ మీట్ పెట్టి.. కూటమి సర్కార్ మీద ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉందని.. అందుకే తన పర్యటనలకు అభిమానులు, ప్రజలు పెద్ద ఎత్తున వస్తున్నారని గొప్పగా కూడా చెప్పుకున్నారు.
Also Read : ట్రంప్ కు ఇరాన్ వార్నింగ్.. మా రియాక్షన్ కు రెడీగా ఉండు
సరిగ్గా ఇలాంటి సమయంలోనే రప్పా రప్పా డైలాగ్ వార్ మొదలైంది. ఈ పోస్టర్ పట్టుకున్న రవితేజ అనే యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత నరుకుతాం అని పోస్టర్ వేస్తే.. మంచిదేగా అని జగన్ అన్న మాట పెద్ద దుమారం రేపింది. అయితే.. జగన్ పర్యటనలో ఇద్దరు కార్యకర్తలు మృతి చెందారు. ఈ వ్యవహారం వైసీపీ నేతలకు పెద్ద తలనొప్పిగా మారింది. ముందు జగన్ పర్యటనలో వాహనం వల్ల కాదన్నారు. కానీ చివరికి వీడియో బయటకు రావడంతో వైసీపీ నేతలకు ఏం చేయాలో అర్థం కాలేదు. జగన్ వాహనం కిందే పడి సింగయ్య మృతి చెందినట్లు వీడియోలో స్పష్టంగా ఉంది. దీంతో ఇప్పుడు వైసీపీ నేతలు కొత్త గేమ్ మొదలు పెట్టారు.
Also Read : తెలంగాణాలో షేక్ ఆడిస్తున్న ఏసీబీ.. ఆరు నెలల్లో ఎన్ని కేసులంటే..?
మాజీ ముఖ్యమంత్రి వాహనం దగ్గరకు ఇంత మంది ఎలా వచ్చారని ప్రశ్నిస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి వాహనం చుట్టూ ఉండాల్సిన రోప్ పార్టీ ఏదీ అంటున్నారు. ఇక ఒక అభిమాని ఏకంగా మాజీ సీఎం వాహనం పైకి ఎక్కాడంటే.. పోలీసుల వైఫల్యం ఏ స్థాయిలో ఉందో తెలుస్తుందని వ్యాఖ్యానిస్తున్నారు. అసలు జగన్‌కు ఇవ్వాల్సిన జెడ్ ప్లస్ కేటగిరి భద్రత ఏమైంది అని ప్రశ్నిస్తున్నారు. మాజీ సీఎం ప్రాణాలకు కనీస భద్రత లేదా అని విచిత్రమైన ప్రశ్నలు వేస్తున్నారు. దీనికి కూటమి నేతలు కూడా ఇప్పుడు ధీటుగానే బదులిస్తున్నారు. అసలు పర్యటను అనుమతి లేదంటే ఎందుకు వెళ్లారని నిలదీస్తున్నారు. పైగా.. జగన్ కాన్వాయ్‌లో 3 వాహనాలు, వంద మందికి మాత్రమే పోలీసులు అనుమతిచ్చారు. కానీ ఎందుకు ఇంత మందిని వెంటేసుకుని వెళ్లారని నిలదీస్తున్నారు. అసలు అంత మందిని ఎందుకు తీసుకువచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు ఏర్పాటు చేసిన బ్యారీకేడ్‌లను కూడా మాజీ మంత్రి అంబటి ఎందుకు తీసేశారో చెప్పాలని ప్రశ్నిస్తున్నారు. ఇదంతా కావాలని చేసినట్లుందని ఆరోపిస్తున్నారు.




