Tuesday, October 28, 2025 04:37 AM
Tuesday, October 28, 2025 04:37 AM
roots

ఆయన ఆదేశించాడు.. మేము పాటించామంతే..!

తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా ఒకటే విషయంపై చర్చ నడుస్తోంది. అది వైసీపీ నేత పోసాని కృష్ణమురళి అరెస్టు విషయం. వాస్తవానికి కూటమి అధికారంలోకి వచ్చిన తొలి రోజు నుంచే పోసాని అరెస్టు ఖాయమనే చర్చ నడుస్తోంది. దీనిపై తెలుగుదేశం, జనసేన పార్టీ నేతలు, కార్యకర్తలు కూడా ప్రభుత్వంపై పలుమార్లు ఒత్తిడి కూడా తీసుకువచ్చారు. అయితే అదును చూసి వేటు వేయాలనే సామెత మాదిరిగా… సరైన సమయం కోసం ఎదురు చూసిన పోలీసులు… సరిగ్గా శివరాత్రి రోజు రాత్రి హైదరాబాద్ గచ్చిబౌలిలోని నివాసంలో పోసానిని అరెస్టు చేశారు. పోసానికి 14 రోజుల రిమాండ్ విధించారు న్యాయమూర్తి. అరెస్టు తర్వాత పోసానిని సుమారు 4 గంటల పాటు విచారించిన పోలీసులు… రిమాండ్ రిపోర్టులో పోసాని చేసిన వ్యాఖ్యలను కూడా కోర్టుకు సమర్పించారు.

Also Read : ఏపీ బడ్జెట్ హైలెట్స్.. సంచలనాలు ఇవే

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో ప్రస్తుత సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్‌పై పోసాని కృష్ణమురళి నోటికి వచ్చినట్లు వాగారనేది ప్రధాన ఆరోపణ. ప్రెస్ మీట్ పెట్టి మరీ పవన్ కల్యాణ్, లోకేష్‌పై పోసాని చేసిన వ్యాఖ్యలు ఇప్పటికీ సోషల్ మీడియాలో పెద్ద దుమారం రేపుతున్నాయి కూడా. జగన్ పాదయాత్ర సమయంలో మర్యాద పూర్వకంగా కలిశారు పోసాని. ఇక వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తన కామెంట్స్‌కు మరింత పదును పెట్టారు. ఎవరు ఎక్కువ తిడితే.. వారికి పదవులు అనే సూత్రం ఆధారంగా పోసానికి ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ పదవి దక్కింది. దీంతో మరింత రెచ్చిపోయారు. పవన్ కల్యాణ్‌కు ఉన్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని పోసాని ఉద్దేశ పూర్వకంగానే వ్యాఖ్యలు చేసినట్లు రిమాండ్ రిపోర్టులో వెల్లడించారు. పవన్ పై విమర్శలు చేస్తే… జనసేన పార్టీ నేతలు, కార్యకర్తలు రెచ్చిపోయి దాడులకు తెగబడతారని… అప్పుడు ఏపీలో శాంతిభద్రతల సమస్య తలెత్తుతుందని… దీనిని సాకుగా చూపించి.. ఎన్నికల్లో లబ్ది పొందాలనేది వైసీపీ నేతల కుట్రగా రిమాండ్ రిపోర్టులో పోలీసులు వెల్లడించారు.

Also Read : మార్చొద్దు.. ఏపీ బిజేపి చీఫ్ పై చంద్రబాబు ఒపినియన్…!

అయితే పోసాని వ్యాఖ్యల వెనుక వైసీపీ కీలక నేత ఉన్నట్లు రిమాండ్ రిపోర్టులో పోలీసులు వెల్లడించారు. నాటి ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆదేశాల మేరకే తాను విమర్శలు చేసినట్లు పోసాని అంగీకరించినట్లు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. తాను చేసిన వ్యాఖ్యలను సోషల్ మీడియాలో ప్రచారం చేసే బాధ్యతలను సజ్జల భార్గవరెడ్డి తీసుకున్నట్లు కూడా పోసాని వెల్లడించారు. దీంతో ఈ వ్యవహారం మొత్తం ప్రస్తుతం తాడేపల్లి ప్యాలెస్‌కు చేరుకుంది. ఇటీవల పార్టీకి రాజీనామా చేసిన మాజీ మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆళ్ల నాని, అవంతి శ్రీనివాస్, డొక్కా మాణిక్య వరప్రసాద్‌తో పాటు వాసిరెడ్డి పద్మ వంటి నేతలు కూడా ఇదే తరహా ఆరోపణలు చేశారు. తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చిన ఆదేశాల మేరకే తామంతా విమర్శలు చేయాల్సి వచ్చిందని.. వెల్లడించారు. ప్రస్తుతం అదే విషయాన్ని పోలీసుల ముందు పోసాని కూడా అంగీకరించడం హాట్ టాపిక్‌గా మారింది. దీంతో ఈ వ్యవహారం మొత్తం ఇప్పుడు తాడేపల్లి ప్యాలెస్‌కు చుట్టుకునేలా ఉంది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.....

తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక...

ఐసీయూలో శ్రేయస్ అయ్యర్.....

సౌత్ ఆఫ్రికా తో కీలక వన్డే...

చావులోను ఆగని విష...

సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మానవత్వంతో...

గట్టిగానే సంక్రాంతి పోటీ.....

సంక్రాంతి పండుగ.. తెలుగు వారికి అతి...

బ్రేకింగ్: పరకామణి కేసులో...

గత కొన్నాళ్లుగా తిరుమలలో పరకామణి వ్యవహారం...

కొత్త జిల్లాలు.. మారనున్న...

ఏపీలో జిల్లాల పునర్‌ విభజన ప్రక్రియ...

పోల్స్