పోలవరం ప్రాజెక్టు సురక్షితమేనా.. ఎటువంటి ఒత్తిడినైనా తట్టుకుంటుందా.. భూకంపాల్లాంటి పెను విపత్తులను తట్టుకుని నిలబడగలదా.. కొంత కాలంగా చాలామందిని వేధిస్తున్న ప్రశ్న ఇది. కొందరైతే బహిరంగంగానే పోలవరం ప్రాజెక్టు భూకంపాన్ని తట్టుకోలేదని విమర్శలు చేసారు. వారి అనుమానాలను పటాపంచలు చేస్తూ.. ప్రాజెక్టు నిర్మాణానికి అధికారులు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
Also Read : వన్ నేషన్ వన్ ఎలక్షన్ షురూ… ఒక్క అడుగు అంతే
పోలవరం ప్రాజెక్టు బహుళార్ధక సాధక ప్రాజెక్టు. సాగు, తాగు నీటితో పాటు జల విద్యుత్ ఉత్పత్తికి ఉపయోగపడేలా నిర్మిస్తున్న ప్రాజెక్టు. మరోపక్క నదులు అనుసంధానానికి బాటలు వేస్తున్న ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే.. ఏపీ వైభవం మరింత ద్విగుణీకృతమవుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. అటువంటి ప్రాజెక్టు నిర్మాణానికి అధికారులు, ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. కానీ కొంతమంది మాత్రం భూకంపాన్ని ప్రాజెక్టు తట్టుకోలేదంటూ ప్రచారాలు చేస్తున్నారు. కానీ వారి వాదనలో పసలేదని ప్రాజెక్టు నిర్మాణం జరుగుతున్న తీరు, అధికారులు ఉపయోగిస్తున్న సాంకేతిక నైపుణాన్ని బట్టి తెలుస్తోంది. విచిత్రమేమిటంటే ఈ ప్రాజెక్టు నిర్మితమవుతున్న ప్రాంతం భూకంపం వచ్చే ప్రాంతం కానప్పటికి, కొందరు మాత్రం పనిగట్టుకుని మరీ తప్పుడు ప్రచారం చేస్తున్నారు.
భూకంపాలు వచ్చే అవకాశాలను దృష్టిలో పెట్టుకుని భారతదేశాన్ని నాలుగు జోన్లుగా విభజించారు. మొదటి రెండు జోన్లు ఉన్న ప్రాంతాల్లో భూకంపం వచ్చే అవకాశాలు ఎక్కువ. మిగిలిన మూడు, నాలుగు జోన్లలో వచ్చే అవకాశం తక్కువ. ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టు ప్రాంతం జోన్ త్రీలో ఉంది. అంటే ఈ ప్రాంతంలో భూకంపాలు వచ్చే అవకాశం చాలా తక్కువని జియాలజిస్టులు చెబుతున్నారు. ఒకవేళ వస్తే… అప్పుడు ఏం చేస్తారు అనే అనుమానాలు కూడా రాకుండా.. భూకంపం వచ్చినా, ప్రాజెక్టు చెక్కుచెదరకుండా ఉండేలా సాంకేతిక విధానంలో దీనిని నిర్మిస్తున్నారు.
Also Read : కేటిఆర్ అరెస్ట్ కు రంగం సిద్దం… గవర్నర్ గ్రీన్ సిగ్నల్…?
భూమి లోపల ఖాళీ ప్రదేశాలు ఏర్పడినప్పుడు.. ఆ ఖాళీలు సర్దుబాటు క్రమంలో భూకంపాలు సంభవిస్తాయి. ఇదే అంశాన్ని ప్రామాణికంగా తీసుకున్న పోలవరం అధికారులు.. అసలు ప్రాజెక్టు నిర్మాణం జరుగుతున్న ప్రాంతంలో అంటే డయాఫ్రం వాల్, ప్రధాన డ్యాంలు నిర్మాణం జరుగుతున్న ప్రాంతంలో నదీ గర్భంలో ఖాళీలు లేకుండా లోపల నేలను గట్టి పరచాలని భావిస్తున్నారు. దానివలన భూకంపం వచ్చే అవకాశం ఉండదని, ఒకవేళ వచ్చినా.. డ్యాం తట్టుకుని నిలబడుతుందని చెబుతున్నారు. దానికి సంబంధించిన పనులను అధికారులు ఇప్పటికే చేపట్టారు. వైబ్రో కంపాక్షన్ విధానంలో నదీ గర్భంలో ఖాళీలు ఉన్న ప్రదేశాల్లోకి ఇసుకను పంపించి, ఖాళీలను పూరిస్తున్నారు. దాని కోసం భారీ రిగ్లను వాడుతున్నారు. ఆ రిగ్కు ఉండే వైబ్రేటర్ దాదాపు 100 అడుగుల లోతు వరకు వెళ్లి ఖాళీలను పూరిస్తుంది. ఇలా చేయడం వలన నదీ గర్భంలో ఉండే నేల గట్టిపడుతుందని అధికారులు చెబుతున్నారు. దీని వలన ప్రాజెక్టు పునాదులు కదలకుండా ఉంటాయని ఇంజనీరింగ్ నిపుణులు చెబుతున్నారు. భూ కంపాలు, భూప్రకంపనలు వచ్చినా.. ఎటువంటి నష్టం ఉండదనేది నిపుణుల మాట.
Also Read : అమరావతికి మరో మణిహారం.. బాబు కీలక ప్రకటన
పోలవరం ప్రాజెక్టు నిర్మాణం మొదలవ్వడానికి ముందే దానికి సంబంధించి రూర్కీ ఐఐటీ నిపుణులు, హైదరాబాద్కు చెందిన జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా జియాలజిస్టులు అక్కడి భూసాంద్రత అంటే… సాయిల్ డెన్సిటీపై అధ్యయనం చేశారు. ప్రాజెక్టు నిర్మాణానికి ఆ ప్రాంతం చాలా అనువుగా ఉందని వారు సర్టిఫై చేసిన తర్వాతే పనులను ప్రారంభించారు. కాగా రెండోసారి నిర్మిస్తున్న డయాఫ్రమ్ వాల్ పనులు, ప్రధాన డ్యాం పనులు మొదలవ్వడానికి ముందుగానే వీరు మరోసారి ప్రాజెక్టు ప్రాంతాన్ని పరిశీలించారు. అదే విధంగా పోలవరం ప్రాజెక్టు అథారిటీ, డ్యాం డిజైన్ ఇంజనీర్లు కూడా ప్రాజెక్టు నిర్మాణంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ విధంగా పోలవరం ప్రాజెక్టుకు ప్రకృతి వైపరీత్యాల నుంచి ఎటువంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది.